మహానటి సినిమాలో తన నటనతో అద్భుతంగ ఆకట్టుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.ఈమె తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను యిట్టె ఆకట్టుకుంటుంది.ఇక అలంటి కీర్తి సురేష్ పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఒక కుర్రాడితో చాట్ చేయడం అంటే మాములు విషయం కాదు.అయితే ఇక్కడ ఆ అబ్బాయికి అది కీర్తి సురేష్ ఫోటో అని తెలియదు.ఆమె పేస్ బుక్ ఫోటో చూసి ఆమె అందానికి మైమరచిపోయి పెళ్లి వరకు వెళ్లేంత వరకు వీరిద్దరి చాటింగ్ కొనసాగింది.నటి కీర్తి సురేష్ పేస్ బుక్ లో పెట్టి అది తన ఫోటో అని ఒక యువకుడిని మోసం చేసింది ఒక మహిళా.కర్ణాటక కు చెందిన పరుశురాం అనే యువకుడు హైదరాబాద్ లో భావన నిర్మాణ కార్మికులకు సూపర్ వైజర్ గా పని చేస్తూ నెలకు రూ.30000 వేలు సంపాదిస్తున్నాడు.అయితే ఇతనికి పేస్ బుక్ లో మంజుల అనే ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో పరిచయం జరిగింది.
అయితే మంజుల పేస్ బుక్ లో తన ఫోటో కి బదులుగా హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటోను పెట్టింది.అది హీరోయిన్ ఫోటో అని తెలియని యువకుడు ఆమె అందానికి మైమరిచిపోయాడు.తనకు పరిచయం అయినా మంజుల హీరోయిన్ లా ఉందని తెగ సంబరపడిపోయాడు.ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.మంజుల తాను గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాని,తనకు ఆర్ధిక కష్టాలు ఉన్నాయని ఆ యువకుడికి చెప్పింది.పరుశురాం ఆమె చదువు కోసం ఇంట్లో పొదుపు చేసిన డబ్బుతో పాటు ఫ్లాట్ తో సహా అన్ని కూడా అమ్మేసి ఆమెకు డబ్బులు పంపించేవాడు.ఆ యువకుడు ఆమెను కలవకుండానే ఫోన్ పే ద్వారా 40 లక్షల వరకు ఆమెకు పంపించాడు.
ఎప్పుడు కలుద్దాం అని చెప్పిన కూడా మంజుల ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది.అనుమానం వచ్చిన పరుశురాం తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆమెకు చెప్పాడు.అయితే మంజుల పేస్ కనపడకుండా వీడియొ కాల్ చేసి మాట్లాడుతూ..నువ్వు నాతొ మాట్లాడుతూనే స్నానం చేయి అని చెప్పింది.దాంతో పరుశురాం స్నానం చేస్తూ వీడియొ కాల్ మాట్లాడాడు.ఆ వీడియొ కాల్ ను రికార్డ్ చేసిన మంజుల ఆ తర్వాత ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.దాంతో పరుశురాం మంజుల మీద నవంబర్ 15 న సిందగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.ఎస్పీ ఆనంద్ కుమార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ మోసం లో ఆమె కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది.ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.