సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఓవర్ నైట్ లో సెలెబ్రెటీలు అయిపోయిన వాళ్ళు చాల మందే ఉన్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరొక మట్టిలో మాణిక్యం వీడియొ వెలుగులోకి వచ్చింది.లతా మంగేష్కర్ సూపర్ హిట్ పాట అయినా సునో సజహ్న పాపి హే నే అనే పాటను ఒక మహిళా మహాబలేశ్వర్ విధుల్లో పాడిన పాట వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ప్రతిభకు మన దేశం లో కొరత లేదు అని మరో మహిళా రుజువుచేసింది.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు.
టాలెంట్ ను నిరూపించుకోవడంలో సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో సందేహం లేదు.చాల మంది సోషల్ మీడియా రాత్రికి రాత్రే స్టార్లుగా మార్చేసింది.లత మంగేష్కర్ సూపర్ హిట్ పాటకు ఒక మహిళా పాడిన పాట వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.సంగీత ప్రియులకు ఈ పాట ఒక ట్రీట్ అని చెప్పచ్చు.
ఎంతో హృద్యంగా పాడుతూ ఆ మహిళా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది.1966 లో రిలీజ్ అయినా ఆయే దిన్ బహార్ కె అనే సినిమా నుంచి లత మంగేష్కర్ పాడిన పాటను ఆ మహిళా పాడి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఆ మహిళా గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా ఉందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియొ ను సయ్యద్ సల్మాన్ అనే యూసర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం జరిగింది.ఇప్పటి వరకు ఆరు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించటం జరిగింది.ఆమె మధుర గళాన్ని మెచ్చుకుంటూ నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram