పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరగడానికి అసలైన కారణం ఏంటో తెలుసా…


వివాహం తర్వాత మహిళలు సాధారణంగా కొంత బరువు పెరుగుతారు. పెండ్లికి ముందు సన్నగా ఉన్న వారు కూడా వివాహం అనంతరం బాడీ వేట్ లో కొంత మార్పు రావడం సహజంగా వస్తుంది. సన్నగా ఉన్న వారు  లావు అయితే.. బొద్దుగా ఉన్న వారు కూడా మరింత బొద్దుగా మారుతారు. ఎందుకిలా అవుతుందో ఆలోచించారా..? జవాబు దొరకలేకుంటే ఇక్కడ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

పెండ్లికి ముందు..

మహిళలు సాధారణంగా ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. కానీ పెండ్లి కాక ముందు అమ్మాయిలు పుట్టింట్లో తల్లి అన్ని పనులు చేస్తున్నా.. వీరు ఎక్కువగా ఇంటి పని చేయరు.. కానీ వీరి శ్రమ వేరే రూట్ లో మళ్లుతుంది. వివాహానికి ముందు అమ్మాయిలు బాడీని మెయింటెన్ చేసేందుకు జిమ్ లకు వెళ్తుంటారు. లేదా చదువు విషయంలో బిజీగా ఉంటారు. మంచి శ్రద్ధ పెట్టి చదివినా కూడా కేలరీలు ఎక్కువ ఖర్చవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది. బ్రెయిన్ కూడా ఆ విధంగా విధులు నిర్వర్తిస్తుందట. ఇక కెరీర్ లో స్థిరపడేందుకు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. బయటకు వెళ్లడం. జాబ్ వెతుక్కోవడం. ఇలా చాలా పనులు చేస్తూ టెన్షన్ గా ఉంటారు. దీని వల్ల కూడా చాలా కేలరీలు ఖర్చవుతూ ఉంటాయి. పైగా దైనందిన జీవితంలో పడి తినడం కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వివాహం తర్వాత..

పెండ్లికి ముందు ఇంతలా శ్రమించిన మహిళలు వివాహం తర్వాత సాధారణంగా కొంత గ్యాప్ వస్తుంది. కొత్త ఇంట్లో కొత్త కాపురం అన్నీ తెలుసుకునేందుకు కొంత కాలం పడుతుంది. దీనికి తోడు మొదట అత్తగారి వంట.. కొత్త రుచులు కూడా కారణం. పెండ్లికి ముందు జాబ్ చేస్తున్న వారి సంగతి అటుంచితే.. ఎలాంటి జాబ్ లేని వారు కావాల్సినంత రెస్ట్ దొరుకుతుంది. చిన్న చిన్న ఇంటి పనులు పూర్తి చేసుకున్నాక (పిల్లలు పుట్టకమందు) ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న జమానాలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా ఒక కారణమే. ఉమ్మడి కుటుంబం అయితే అందరికీ పనులు చేసి పెట్టడంలో ఎక్కువ శ్రమించాలి. ఇక తిండి విషయానికి వస్తే వండిన పదార్థాలు వృథా అవుతాయోనని పట్టకున్నా కూడా మిగిలింది పడేయకుండా తినేస్తారు. ఇది కూడా ఒక కారణమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో ఎక్కువ శాతం జంటల్లో పెండ్లి అయిన కొత్తలో 2 నుంచి 3 కిలోల బరువు పెరుగుతారని తెలిసింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *