గ్రహణం వీడిన వెంటనే ఇంట్లో ఆడవాళ్ళూ తప్పకుండ చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా…

NEWS DESK
1 Min Read
Solar Eclipse

అక్టోబర్ 25 న సాయంత్రం సూర్యగ్రహణం సంభవించనుంది.దీపావళి తర్వాతి రోజు సాయంత్రం ఈ సూర్యగ్రహణం సంభవించనుంది.భారత్ లో ఈ గ్రహణం సాయంత్రం 4 .40 నిమిషాల నుంచి 6 .09 నిమిషాల వరకు కనిపించనుంది.ఇక ఈ సూర్యగ్రహణం దీపావళి తర్వాత ఏర్పడుతుండడం తో అధిక ప్రాధాన్యత సంతరించుకుందిగా చెప్తున్నారు.22 ఏళ్ళ తర్వాత ఏర్పడుతున్న అరుదైన సూర్యగ్రహణం అని నిపుణులు చెప్తున్నారు.హిందూ సంప్రదాయాలలో గ్రహణాలు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికి తెలిసిందే.

గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడని కొన్ని పద్ధతులు పాటించాలి అని నిపుణులు చెప్తుంటారు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అటు ఇటు తీరకుండా ఏ పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తుంటారు.గ్రహణం సమయంలో భోజనం కూడా చేయకూడదు అని చెప్తుంటారు పెద్దలు.

Solar Eclipse
Solar Eclipse

ఇంట్లో ఉండే ఆహారపదార్ధాల మీద గరిక పోచలు ఉంచడం వలన వాటిని తరువాత వాడుకోవచ్చు అని చెప్తుంటారు.గ్రహణ సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని తినకుండా రాత్రికి మల్లి వండుకోవాలి అని చెప్తుంటారు.గ్రహణం పట్టడానికి ముందు మరియు గ్రహణం వీడిన తర్వాత తప్పకుండ తలస్నానం ఆచరించాలి.ఇంట్లో ఆడవాళ్లు గ్రహణం వీడిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకొని,తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అని నిపుణులు చెప్తుంటారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *