తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ కంటే కూడా ఫిమేల్ యాంకర్స్ చాల మంది ఉన్నారు.యాంకర్ అంటేనే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చే యాంకర్ సుమ కనకాల.ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుమ కనకాల నుంచి విష్ణు ప్రియా వరకు చాల మంది యాంకర్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే వాళ్ళు యాంకర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్లుగా కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.ఈ కోవలో చాల మంది యాంకర్లు వెండి తెరపై తమ సత్తా చాటుతున్నారు.తాజాగా సుమ కనకాల 46 ఏళ్ళ వయస్సులో జయమ్మ పంచాయతీ అనే సినిమాతో రాబోతుంది.ఇలా హీరోయిన్లుగా చేసిన యాంకర్లు ఎవరంటే..
సుమ కనకాల:కెరీర్ స్టార్ట్ అయ్యిన కొత్తలో సుమ కనకాల కొన్ని సినిమాలలో కనిపించారు.ఆ తర్వాత తన దృష్టి మొత్తం కేవలం యాంకరింగ్ మీదనే పెట్టి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమ కనకాల.మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత జయమ్మ పంచాయతీ అనే సినిమాతో రాబోతున్నారు సుమ కనకాల.ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
రష్మీ గౌతమ్:ఈమెకు వెండి తెరమీద చాల క్రేజ్ ఉంది.చిన్న సినిమాలతో తన సత్తా చాటుతుంది రష్మీ గౌతమ్.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయనుంది రష్మీ గౌతమ్.
అనసూయ భరద్వాజ్:కెరీర్ ను న్యూస్ యాంకర్ గా మొదలుపెట్టి ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉంది అనసూయ.ఇటీవలే పుష్ప సినిమాలో అనసూయ పాత్రకు మంచి స్పందన వచ్చింది.
శ్రీముఖి:ఇప్పుడు బుల్లి తెరమీద ఉన్న క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు.ఒకవైపు బుల్లితెర మీద షో లతో పాటు సినిమా అవకాశాలతో కూడా బిజీ గా ఉంది శ్రీముఖి.
కలర్స్ స్వాతి:కలర్స్ అనే ప్రోగ్రాంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి.ఆ తర్వాత వరుస అవకాశాలతో సినిమాలు చేసి స్టార్ అయిపొయింది.
రెజీనా కెసెండ్రా:రెజీనా కెరీర్ యాంకరింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది అని చాల మందికి తెలియదు.తమిళనాడు లో ఒక ఛానల్ లో యాంకర్ గా చేసిన రెజీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
నిహారిక కొణిదెల:ఢీ అనే ప్రోగ్రాంతో పాటు మరికొన్ని ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది నిహారిక.ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది.
విష్ణు ప్రియా:బుల్లితెర మీద ఇప్పుడున్న యాంకర్లలో గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియా.హీరోయిన్ గా కూడా తన సత్తా చాటే ప్రయత్నాలు చేస్తుంది విష్ణు ప్రియా.
ఉదయభాను:సీనియర్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది.బుల్లితెర తో పాటు సినిమాలలో కూడా తన సత్తా చాటింది ఉదయభాను.ప్రస్తుతం ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.