కొంత మంది దొంగతనం చేయడం అనైతికం,చట్ట వ్యతిరేకం అని తెలిసిన కూడా దొంగతనాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.ఎవ్వరికీ దొరకకుండా చాల చలాకీగా దొంగతనం చేయడం అనేది చాల కష్టంతో కూడుకున్న పని.ఇదివరకటి రోజుల్లో అయితే దొంగతనం చేసిన వాళ్ళను పోలీసులు వెంటపడి పట్టుకునే వాళ్ళు.కానీ ఇప్పుడున్న రోజుల్లో ,ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ తో ప్రతి షాప్ లోను సీసీ టీవీ కెమెరా లు పెట్టడం వలన దొంగలు యిట్టె దొరికిపోతున్నారు.
ముందు గమనించలేక పోయిన కూడా ఆ తర్వాత సీసీటీవీ పుటేజ్ లను ఒకటి కి రెండు సార్లు పరిశీలిస్తే దొంగలు యిట్టె దొరికిపోతున్నారు.దొంగలను పట్టుకోవడం లో సగం పని సీసీటీవీ కెమెరాలు చేసేస్తున్నాయి.అలంటి చలాకి దొంగతమకు సంబంధించిన వీడియొ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో కనిపిస్తుంది.ఈ వీడియోలో ఒక యువతి గోల్డ్ రింగ్ కొనడానికి షాప్ కు వెళ్తుంది.ఆ షాప్ అతను ఆ యువతికి గోల్డ్ రింగ్స్ చూపిస్తున్నాడు.
ఆ వ్యక్తి కొంచెం పక్కకు జరగ గానే ఆ యువతి అందులో ఉన్న ఒక రింగ్ ను తీసేసి వెంటనే దాని స్థానంలో తన చేతిలో ఫోన్ వెనక ఉన్న మరో రింగ్ ను పెట్టేసింది.ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తే ఆ యువతి యెంత చలాకీగా రింగ్ కొట్టేసిందో తెలుస్తుంది.ఆ యువతి రింగ్ కొట్టేయడం మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రెకార్డ్ అయ్యింది.ఆ షాప్ వ్యక్తికీ ఏ మాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా యువతి ఇదంతా చేసింది.
मैडम की हेरा-फेरी, उड़ा ले गई सोने की अंगूठी#Viralvideo #Omgvideo pic.twitter.com/HW9uuLj9GH
— @StunnedVideo (@kumarayush084) December 6, 2021