సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు.సినిమా తారలే దేవుళ్ళు అంటూ చాల మంది అభిమానిస్తూ ఉంటారు.సినిమా తారల ఇళ్లలో వాళ్ళు వాళ్లనే ఇష్టపడతారా అంటే అది చెప్పలేని పరిస్థితి.ప్రతి ఒకరికి ఇష్టమైన నటి నటులు ఉంటారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహేష్ బాబు ని ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు.ఇక అమ్మాయిలలో అయితే హీరో మహేష్ బాబు కు చాల క్రేజ్ ఉంటుంది.చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మహేష్ అందానికి నటనకు ఫిదా అవ్వాల్సిందే.జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ కి కూడా మహేష్ బాబు అంటే చాల ఇష్టమట.
ఇటీవలే ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు పాత్రలలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు.విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇప్పటికే ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ ని జరుపుకున్నారు.
ఈ పార్టీలో ఎన్టీఆర్ తో పాటు పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా రావడం జరిగింది.అయితే అభయ్ ను తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగగా ఏ మాత్రం ఆలోచించకుండా మహేష్ బాబు అని చెప్పేసాడు.మహేష్ బాబు అంటే తనకు చాల ఇష్టమని,ఆయన నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ తనకు చాల నచ్చుతుందని చెప్పుకొచ్చాడు అభయ్.అభయ్ మాటలకూ ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు మహేష్ బాబు అభిమానులు కూడా చాల ఖుషీగా ఫీల్ అవుతున్నారు.