Home సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక తెలుగు సీరియల్ ఏదో తెలుసా…!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక తెలుగు సీరియల్ ఏదో తెలుసా…!

0

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వెండితెర తో పాటు బుల్లితెర మీద కూడా రియాలిటీ షోలతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.బిగ్ బాస్ రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఆ తర్వాత మిలో ఎవరు కోటీశ్వరులు షో కు కూడా హోస్ట్ గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు.అయితే సినిమాల్లోకి రాకముందు జూనియర్ ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించారు అనే సంగతి చాల మంది ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు.

అయితే అప్పట్లో ఈటీవీ లో ప్రసారం అయ్యే భక్త మార్కండేయ అనే సీరియల్ లో ఆయన నటించారు.ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయినా మార్కండేయ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.చిన్న వయస్సులోనే ఈ సీరియల్ లో శివుని భక్తుడిగా అద్భుతంగా నటించి ఎన్టీఆర్ అందరిని ఆకట్టుకున్నారు.ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాలరామాయణం లో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ నటించారు.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ఎన్టీఆర్.ఇక ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా,రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో మరియు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ సాధించారు.ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం అందరిని ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here