వైఎస్ షర్మిల కుమారుడు ఎక్కడుంటారో..ఏం చేస్తున్నారో తెలుసా…ఫ్యామిలీ పిక్స్ వైరల్….

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో ఈమె పాదయాత్రలు చేస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు.తెలంగాణాలో ప్రజల సమస్యలు తెలుసు కుంటూ వాటిని పరిష్కరిస్తూ,ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల.ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ అని అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ దంపతుల పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాల మందికి తెలియదు.

తాజాగా షర్మిల పిల్లల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.షర్మిల కుమారుడు అయినా వైఎస్ రాజారెడ్డి అమెరికా లో గ్రాడ్యువేషన్ పూర్తి చేసారు.ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యువేషన్ సెర్మనీకి షర్మిల,అనిల్ కుమార్ దంపతులు మరియు షర్మిల తల్లి విజయమ్మలు వెళ్లడం జరిగింది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో షర్మిల కుమారుడు మరియు కుమార్తెలను చూడవచ్చు.రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ లో సథరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ లో గ్రాడ్యువేషన్ పూర్తి చేయడం జరిగింది.

కుమారుడు గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన సందర్భంగా షర్మిల…రాజా నీకు కంగ్రాట్స్..నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇలా ఒక అద్భుతం పూర్తి చేయడం నిజంగా సంతోషంగా ఉంది.నిజాయితీగా,దయతో ఉండు..నీ చుట్టూ ఉన్న ప్రజలకు విలువనివ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్న అంటూ ట్వీట్ చేసారు.ఆమె చేసిన ట్వీట్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *