Gold Investment: నిపుణుల అంచనా ప్రకారం 2035 నాటికి తులం బంగారం ధర ఎంత ఉంటుందంటే

Gold Investment: చాలామంది బంగారంలో పెట్టుబడి సురక్షితమైనదిగా భావిస్తారు. మనదేశంలో బంగారం కేవలం ఆర్థిక పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా సాంస్కృతిక మరియు సామాజిక విలువలతో కూడా ముడిపడి…

Gold Investment
Gold Investment
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Gold Investment: చాలామంది బంగారంలో పెట్టుబడి సురక్షితమైనదిగా భావిస్తారు. మనదేశంలో బంగారం కేవలం ఆర్థిక పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా సాంస్కృతిక మరియు సామాజిక విలువలతో కూడా ముడిపడి ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి బంగారం ధరలలో గణనీయమైన మార్పులను చూస్తున్నాము. ప్రస్తుతం అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరి రానున్న 10 ఏళ్లలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి.. ప్రస్తుతం బంగారం కొని పెట్టుకుంటున్న వాళ్ళు పరిస్థితి ఏంటి, దీని గురించి నిపుణులు ఏం అంచనా వేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉధృతదలు మరియు సెంట్రల్ బ్యాంకులో కొనుగోల వంటి అంశాల ఆధారంగా రానున్న దశాబ్దం కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం 10 గ్రాములు లక్ష రూపాయలకు చేరవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ కూడా బంగారం సరఫరా పెరిగినట్లయితే ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మనదేశంలో బంగారం పై పెట్టుబడి పెట్టే వాళ్ళు మార్కెట్ రెండు లను గమనించి అలాగే ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోవడం చాలా అవసరం. అనేక ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులు వంటివి రానున్న రోజులలో బంగారం డిమాండ్ ను పెంచుతాయి.

అయితే 2026 నాటికి బంగారం ధర ఔన్స్ కు నాలుగువేల డాలర్లు దాటావచ్చని జేపీ మోర్గాన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మాంధ్యం భయాలు మరియు వాణిజ్య ఉద్రిక్తతలు అని చెప్తున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న సంఘర్షణలు బంగారాన్ని మరింత సురక్షిత ఆస్తిగా ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత మూడు ఏళ్లుగా చైనా ఏటా 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న క్రమంలో బంగారం ధరలు దీర్ఘకాలంలో పెరుగుతాయి. డాలర్ విలువ తగ్గడం వలన కూడా బంగారం ధరలో పెరుగుదలను సూచిస్తుంది. సాధారణంగా బంగారం ధర డాలర్ తో వ్యతిరేక సంబంధం కలిగి ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ బంగారం సరఫరా పెరిగినట్లయితే ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి మన దేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అక్షయ తృతీయ వంటి పండుగ సీజన్లో సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వలన కూడా ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Gold Price Today: గోల్డ్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోతున్న బంగారం ధరలు

Gold Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →