Tuesday, October 20, 202610:01 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Actress Gajala: షాక్ అయ్యేలా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ గజాల…ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

Actress Gajala: షాక్ అయ్యేలా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ గజాల…ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

Actress Gajala: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత అవకాశాలు వచ్చే వరకు ఒక బాధ అయితే అవకాశలు వచ్చాక మరొక బాధ ఉంటుంది.సినిమాలలో నటించే వాళ్ళను…

AT A GLANCE

Actress Gajala: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత అవకాశాలు వచ్చే వరకు ఒక బాధ అయితే అవకాశలు వచ్చాక మరొక బాధ ఉంటుంది.సినిమాలలో నటించే వాళ్ళను…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 7 January 2025, 10:10 · 10:10 am◷ 2 min read
UpdatedTuesday, 7 January 2025, 10:10 · 10:10 am
⚡ HelloBD Shorts

Actress Gajala: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత అవకాశాలు వచ్చే వరకు ఒక బాధ అయితే అవకాశలు వచ్చాక మరొక బాధ ఉంటుంది.సినిమాలలో నటించే వాళ్ళను అందరు గుర్తుపెట్టుకుంటారు.అయితే వాళ్లలో చాల మంది ఓవర్ నైట్ లో స్టార్స్ అయినా వాళ్ళు కూడా ఉంటారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసును దోచిన హీరోయిన్లు చాలానే ఉన్నారు అని చెప్పచ్చు.అలా ఒక సినిమాతో పేరు తెచ్చుకున్న తర్వాత ఆ పేరును నిలబెట్టుకోవడం కూడా చాల కష్టం అని చెప్పచ్చు.అలా ఒక సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు అని చెప్పచ్చు.

సినిమాల్లోకి రాకముందు ఆమె అసలు పేరు రాజి.ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె గజాల గా మార్చుకున్నారు.జగపతి బాబు హీరోగా 2001 లో రిలీజ్ అయినా నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది గజాల.

ఆ తర్వాత తెలుగులో కలుసుకోవాలని,స్టూడెంట్ నెంబర్ వన్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.తెలుగులో ఈమె దాదాపుగా 30 సినిమాలలో నటించడం జరిగింది.ఆ టైం లోనే టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరోతో ప్రేమలో పడటం ఆ తర్వాత అతను మోసం చేశాడంటూ ఆత్మహత్య ప్రయత్నం చేయడం అప్పట్లో దుమారం లేపిన విషయం.

అదే సమయంలో సీనియర్ హీరో అర్జున్ ఆమెను సేవ్ చేసి అన్ని విధాలా ఆసరాగా ఉన్నారనే వార్త కూడా వినిపించింది.ఇక గజాల 2011 లో రిలీజ్ అయినా మనీ మనీ మోర్ మనీ సినిమాలో చివరగా కనిపించడం జరిగింది.ఈమె టీవీ నటుడు అయినా ఫైజల్ రాజా ఖాన్ ను 2016 లో పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం గజాల ముంబై లో ఉంటుందని సమాచారం.అయితే ప్రస్తుతం ఈమె తన భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.