Home » బిజినెస్ » Todays Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 5 రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం మళ్లీ పెరిగింది

Todays Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 5 రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం మళ్లీ పెరిగింది

Todays Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 5 రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం మళ్లీ పెరిగింది
Todays Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 5 రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈరోజు మాత్రం మళ్లీ పెరిగింది

Todays Gold Rate: గత ఐదు రోజుల నుంచి భారీగా తగ్గుతూ వచ్చినా బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి ధర అమాంతంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం చేసుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 710 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పెరిగినట్లు సమాచారం. మరోవైపు వెండి ధర తగ్గుతూ కనిపిస్తుంది.

కిలో వెండిపై 1000 రూపాయల వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి మరియు సిల్వర్ రేట్లు పెరిగినట్లు తెలుస్తుంది.ఔన్స్ గోల్డ్ ధర మంగళవారం రోజున 3000 డాలర్లు ఉండగా ఈరోజు బుధవారం నాటికి 9 డాలర్లు పెరిగి 3009 డాలర్లకు చేరుకుందని సమాచారం. ఇప్పుడు ఔన్స్ వెండి ధర 29.82 డాలర్లుగా ఉంది.

ఈరోజు పెరిగిన పసిడి ధరలతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మళ్లీ 90000 మార్కును దాటింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు అయిన విజయవాడ వంటి నగరాలలో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం తదితర ప్రాంతాలలో ఈరోజు బంగారం ధర పెరిగింది.

ఈ ప్రాంతాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,440 గా ఉందని సమాచారం. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,050 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,590 గా ఉందని సమాచారం. హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో వెండి ధర తగ్గింది. ఆ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.1,02,000 గా నమోదయింది.