Saturday, November 14, 20263:49 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Eeswar Heroine: ప్రభాస్ తో నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా…ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!

Eeswar Heroine: ప్రభాస్ తో నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా…ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!

Eeswar Heroine: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.జయంత్ సి పనర్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ప్రభాస్…

AT A GLANCE

Eeswar Heroine: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.జయంత్ సి పనర్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ప్రభాస్…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 7 January 2025, 15:30 · 3:30 pm◷ 2 min read
UpdatedTuesday, 7 January 2025, 15:30 · 3:30 pm
⚡ HelloBD Shorts

Eeswar Heroine: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.జయంత్ సి పనర్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు జోడిగా శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది.హీరోయిన్ శ్రీదేవి నటించిన మొదటి సినిమా ఈశ్వర్ అయినప్పటికీ బాలనటిగా శ్రీదేవి పలు సినిమాలలో నటించింది.రుక్మిణి అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ కు చెల్లెలి పాత్రలో కనిపించింది శ్రీదేవి.చిన్నప్పుడూ కొంచెం బొద్దుగా ఉండే శ్రీదేవి ఆ తర్వాత సన్నగా ఎంతో అందంగా కనిపించింది ఈశ్వర్ సినిమాలో.

మొదటి సినిమాతోనే శ్రీదేవి తన అందంతో,నటనతో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.1992 రిక్షా మామ అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది శ్రీదేవి.2002 లో ప్రభాస్ కు జోడిగా ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈశ్వర్ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.ఈశ్వర్ సినిమా విజయం తర్వాత తమిళ్ లోను,తెలుగులోనూ శ్రీదేవి కి అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే తమిళ్ లో కంటే తెలుగులోనే శ్రీదేవి కి మంచి క్రేజ్ వచ్చింది.తెలుగులో ఈమె నిన్నే ఇష్టపడ్డాను,నిరీక్షణ,ఆదిలక్ష్మి,పెళ్లి కానీ ప్రసాద్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి.ఈ దంపతులకు రూపిక అనే పాప ఉండి.శ్రీదేవి చివరిసారిగా 2011 లో మాస్ మహారాజ్ రవితేజ కు జోడిగా వీర సినిమాలో కనిపించింది.పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తుంది శ్రీదేవి.అలాగే డాన్స్ మరియు ఇతర రియాలిటీ షో లకు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది.ప్రస్తుతం శ్రీదేవి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.