Unstoppable with NBK S4: బాలయ్యతో అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇక నందమూరి, మెగా ఫ్యాన్స్ కు పండగే.!

Unstoppable with NBK S4: ఒక సందర్భంలో ఆయన హీరో రామ్ చరణ్ కు ఫోన్ చేయగా బాలయ్య మాట్లాడిన సంగతి తెలిసిందే. బాలయ్య నా షో కు ఎప్పుడు వస్తున్నావ్ అని రాంచరణ్ అడిగినప్పుడు.. మీరు పిలవడమే ఆలస్యం అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తుంది. ఇక హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Unstoppable with NBK S4
Unstoppable with NBK S4
STORY SNAPSHOT

What you need to know

Deskతాజా వార్తలు

ReporterGopi Krishna

UpdatedDec 31 · 2:56 PM

Reading2 min

Reader Tools

Unstoppable with NBK S4: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటిటీ ఆహా లో ఈ షో ప్రసారమవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇటీవలే విక్టరీ వెంకటేష్ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్, ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి బాలయ్యతో అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు.

సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వెంకటేష్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ షోలో బాలయ్యతో పంచుకున్నారు. ఇక ఈ టాక్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) కూడా పాల్గొననున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఈ షోలో బాలయ్యతో ముచ్చటించనున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 31న హీరో రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం. గతంలో ఈ టాక్ షోలో హీరో ప్రభాస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒక సందర్భంలో ఆయన హీరో రామ్ చరణ్ కు ఫోన్ చేయగా బాలయ్య మాట్లాడిన సంగతి తెలిసిందే. బాలయ్య నా షో కు ఎప్పుడు వస్తున్నావ్ అని రాంచరణ్ అడిగినప్పుడు.. మీరు పిలవడమే ఆలస్యం అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తుంది. ఇక హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య నటించిన డాగు మహారాజ్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

RRR Malli: సినిమా స్టార్ట్ అయ్యే సరికి 8వ తరగతి చదువుతుంది.. పూర్తయ్యేసరికి ఇంటర్ అయిపోయింది…ఆర్ఆర్ఆర్ లో మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా!

RRR Malli: మల్లి పాత్రలో కనిపించిన ఈ అమ్మాయి పేరు ట్రింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా ట్వింకిల్ మంచి…

Ram Charan: గేమ్ చేంజర్ సినిమాకు తన పారితోషకాన్ని తగ్గించుకున్న రామ్ చరణ్… దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఇదే

Ram Charan: తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించినట్లుగా తెలుస్తుంది.…

Ticket Prices: సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం.. ఏ సినిమాకు ఎంత పెంచారో తెలుసుకోండి.!

Ticket Prices: దుల్కర్ సల్మాన్, బాబి డియోల్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →