Jai Chiranjeeva
Jai Chiranjeeva

Jai Chiranjeeva: జైచిరంజీవ సినిమాలో ఉన్న చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా!

Jai Chiranjeeva: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జైచిరంజీవ చిత్రంలో చిరంజీవి మేనకోడలిగా నటించిన శ్రియా శర్మ అందరికి గుర్తుండే ఉంటుంది.సమీరా రెడ్డి,భూమిక ఈ సినిమాలో హీరోయిన్లుగా చేసారు.జైచిరంజీవ సినిమాలో శ్రియ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో చిరంజీవి మేనకోడలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.అయితే శ్రియ శర్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైంది మాత్రం నువ్వు నేను ప్రేమ చిత్రంతో.ఈ చిత్రంలో శ్రియ శర్మ సూర్య,జ్యోతిక కూతురిగా నటించింది.

ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ,తమిళ,కన్నడ ఇలా దాదాపు అన్ని భాషలలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా మహేష్ బాబు సినిమా దూకుడు లో సమంత చెల్లెలి పాత్రలో కూడా శ్రియ శర్మ నటించింది.తెలుగులో రచ్చ,తూనీగ తూనీగ,ఎటో వెళ్ళిపోయింది వంటి సినిమాలలో టీనేజ్ అమ్మాయి పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.

ఇలా టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలో హీరోయిన్ గా చేసే అవకాశం రావడంతో బిగ్ బాస్ తో ఫేమస్ అయినా అలిరాజా హీరోగా తెరకెక్కిన గాయకుడూ సినిమాలో శ్రియ శర్మ హీరోయిన్ గా చేసింది.గాయకుడూ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయిందనే చెప్పాలి.ఆ తర్వాత హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కు జోడిగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలో నటించింది.ఇక ఆ సినిమా తర్వాత శ్రియ శర్మ తన దృష్టి మొత్తం మోడలింగ్ పైనే పెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే శ్రియ శర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

child

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now