Tuesday, October 20, 20269:10 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Keerthy Suresh: అరెరే…కీర్తి సురేష్ పేరును ఖునీ చేసేసిన ఫోటోగ్రాఫర్స్..ఏమని పిలిచారంటే

Keerthy Suresh: అరెరే…కీర్తి సురేష్ పేరును ఖునీ చేసేసిన ఫోటోగ్రాఫర్స్..ఏమని పిలిచారంటే

Keerthy Suresh: ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడిగా నటించింది. పెళ్లయిన మూడు రోజులకే కీర్తి సురేష్ (Keerthy Suresh) బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంది.

AT A GLANCE

Keerthy Suresh: ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడిగా నటించింది. పెళ్లయిన మూడు రోజులకే కీర్తి సురేష్ (Keerthy Suresh) బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంది.

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 31 December 2024, 14:56 · 2:56 pm◷ 1 min read
UpdatedTuesday, 31 December 2024, 14:56 · 2:56 pm
⚡ HelloBD Shorts

Keerthy Suresh: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషలలో కీర్తి సురేష్ ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. మహానటి సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా కీర్తి సురేష్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తాజాగా బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడిగా నటించింది. పెళ్లయిన మూడు రోజులకే కీర్తి సురేష్ (Keerthy Suresh) బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని చెప్పొచ్చు. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇదిలా ఉంటే బేబీ జాన్ సినిమా కోసం హీరోయిన్ కీర్తి సురేష్ నిత్యం ముంబైలో సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే కొందరు ఫోటోగ్రాఫర్ కీర్తి సురేష్ ను ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ కొందరు ఆమెను కృతి అంటూ పిలిచారు. అప్పుడు కీర్తి సురేష్ నా పేరు కృతి కాదు కీర్తి అని తెలిపింది. అలాగే మరికొంతమంది కీర్తి దోస అనే పిలవడంతో ఈమె అభ్యంతరం వ్యక్తం చేసింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేష్ అని చెప్పి నాకు దోస అంటే చాలా ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి సురేష్.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.