Mahesh Babu Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.
తాజాగా సినిమాలో కీలకమైన నెగిటివ్ రోల్‌లో కనిపించనున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘వారణాసి’ని కేవలం సాధారణ టైమ్ ట్రావెల్ కథగా చూడలేమని ఆయన చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
‘కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు’
‘వారణాసి’ కథ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “ఇది కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు. అంతకుమించిన స్థాయిలో కథ ఉంటుంది. డిఫరెంట్ టైమ్ ట్రావెల్స్ మధ్య ఈ కథ సాగుతుంది” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో రాజమౌళి ఈ కథను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ముఖ్యంగా సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉండబోతోంది, మహేశ్ బాబుతో ఆయనకు ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనే చర్చ కొనసాగుతోంది.
Also Read: Prabhas: ప్రభాస్ Instagramలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?
మహేశ్, ప్రియాంకతో కలిసి పనిచేయడంపై పృథ్వీరాజ్
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని పృథ్వీరాజ్ తెలిపారు.
అయితే పృథ్వీరాజ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది. మిగిలిన షూటింగ్‌ను కూడా మరో మూడు వారాల్లో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ ప్రమోషన్స్?
షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పలు విదేశీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. అలాగే సినిమాను రెండు భాగాలుగా కాకుండా సింగిల్ పార్ట్‌గానే రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
పృథ్వీరాజ్ తాజా వ్యాఖ్యలతో ‘వారణాసి’ కథపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇక షూటింగ్ పూర్తి, ప్రమోషన్స్ లేదా ఇతర అధికారిక అప్డేట్స్‌పై చిత్రబృందం నుంచి వచ్చే ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.




