Tuesday, October 20, 20268:59 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Majili Movie: మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Majili Movie: మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Majili Movie: ‘ఏ మాయ చేశావే..’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన మొదటి చిత్రంతోనే విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మూవీలో హీరోగా నటించిన నాగచైతన్యతో లవ్‌లో…

AT A GLANCE

Majili Movie: ‘ఏ మాయ చేశావే..’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన మొదటి చిత్రంతోనే విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మూవీలో హీరోగా నటించిన నాగచైతన్యతో లవ్‌లో…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 7 January 2025, 10:06 · 10:06 am◷ 2 min read
UpdatedTuesday, 7 January 2025, 10:06 · 10:06 am
⚡ HelloBD Shorts

Majili Movie: ‘ఏ మాయ చేశావే..’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన మొదటి చిత్రంతోనే విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మూవీలో హీరోగా నటించిన నాగచైతన్యతో లవ్‌లో పడడం, అనంతరం పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం. ఆ తరువాత మనస్పర్థలు రావడంతో ఈ కపుల్స్ విడిపోవడం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి నటించిన రెండో మూవీ ‘మజిలీ’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుంది.

ఈ సినిమాకు శివ నిర్వాహణ దర్శకత్వం వహించారు. క్లాసిక్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా భారీ కలెక్షన్లు కురిపించింది. మరోవైపు సమంత, నాగచైతన్య జంట క్రేజ్ ప్రేక్షకుల్లో రెట్టింపైంది. ఇదే చిత్రంలో నటించిన ఓ చిన్నారి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మజిలీలో తన నటనతో అందరి మన్ననలు పొందిన ఈ చిన్నారి ప్రస్తుత ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

సామ్.. చైతుతోపాటు మజిలీలో నటించి అందరితో భేష్ అనిపించుకున్న పాప పేరు అనన్య అగర్వార్. 2008లో బుల్లితెరపై కనిపించిన అనన్య పలు సీరియల్స్‌లో నటించింది. మంచి పర్ఫార్మెన్స్ కబరిచి తనకుంటూ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకుంది. మజిలీ సినిమాలో మంచి నటన కనబరిచి మొదటి చిత్రంతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

ఈ మూవీలో నాగచైతన్య ఎక్స్ లవర్ కూతురుగా నటించిన అనన్య ఆ పాత్రలో ఒదిగిపోయి అందరితోనూ.. ఔరా..! అనిపించింది. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ అప్‌డేటెడ్‌గా ఉంటోంది. నిత్యం తనకు సంబంధించిన ఫొటోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా కుర్రకారు మదిని కొల్లగొడుతోంది. రోజూ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. కొన్ని ఫొటోలు అప్పటికప్పుడు వైరల్ అయ్యి అనన్యకు మరింత క్రేజ్ సంపాదించి పెడుతున్నాయి.

తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ హాటెస్ట్ ఫొటోలు షోల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఒక కుదుపు కుదుపేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ‘పాప’ ఇంత బోల్డ్‌గా మారిందేంటని కామెంట్స్‌తో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మజిలీ మూవీలో జంటగా నటించిన సమంత, నాగచైతన్య పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని ఎవరికి వారు తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.