Tuesday, October 20, 202611:10 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Namitha: బొద్దుగా ఉన్న హీరోయిన్ నమిత …ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!

Namitha: బొద్దుగా ఉన్న హీరోయిన్ నమిత …ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!

Namitha: టాలీవుడ్ టాప్ స్టార్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ. జెమిని సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది…

AT A GLANCE

Namitha: టాలీవుడ్ టాప్ స్టార్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ. జెమిని సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది…

Published By: Gopi KrishnaUpdated On: Tuesday, 7 January 2025, 10:11 · 10:11 am◷ 2 min read
UpdatedTuesday, 7 January 2025, 10:11 · 10:11 am
⚡ HelloBD Shorts

Namitha: టాలీవుడ్ టాప్ స్టార్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ. జెమిని సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సొంతం సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వరుస కట్టాయి. టాలీవుడ్,కోలీవుడ్ లో పెద్ద హీరోల పక్కన సినిమాలు చేసింది.గుజరాత్ అందాల భామ నమిత చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ సినిమాలే చేసినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు నమిత వాంక్వాలా.

గుజరాత్ లోని సూరత్ లో పుట్టింది. 1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. జెమిని సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సొంతం సినిమా చేసింది. ఈ సినిమా విజయంతో నమితకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టకున్నది.

తెలుగుతో పాటు సౌత్ సినిమాల్లోనూ సినిమాలు చేసింది. అయితే అనుకోకుండా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది నమిత. ఈ గ్యాప్ లో నమిత ఒక్క సారిగా బరువు పెరిగింది. 2009లో వచ్చిన బిల్లా సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది నమిత. అలాగే 2010లో వచ్చిన సింహా చిత్రంలో నటించి మెప్పించింది. ఆతర్వాత ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కింది.

2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది నమిత. వీరికి కవలలు పుట్టారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న నమిత వెల్లడించింది. పెళ్లి త్వరా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బొద్దు గుమ్మ ఇంతలా మారిపోయిందేమిటి అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. మళ్లీ ఒకప్పటిలా ఇంత నాజుగ్గా ఎలా మారిందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.