Home సినిమా రాజమౌళి దర్శకుడిగానే కాకుండా అతిథి పాత్రలో నటించిన సినిమాలు ఏవో తెలుసా…

రాజమౌళి దర్శకుడిగానే కాకుండా అతిథి పాత్రలో నటించిన సినిమాలు ఏవో తెలుసా…

0

జక్కన్న దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈయన తీసిన సినిమా అంటే సూపర్ హిట్ అని ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోతారు.ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ఈయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా వరకు కూడా ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో హిట్ అయ్యి ఆయన క్రేజ్ ను దేశవ్యాప్తంగా పెంచేసాయి.

ఆయన సినిమాలలో హీరోల ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే ఆయన సినిమాలలో నటీనటులుగా చేయడానికి చాల మంది క్యూ కడతారు.ఆయన సినిమాలలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు చాల మంది.అయితే దర్శకధీరుడు రాజమౌళి కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో కనిపించారు అనే సంగతి చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పచ్చు.

ఆ సినిమాలు ఏంటంటే…రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలో రాజమౌళి ఎత్తర జెండా అనే పాటలో కనిపించారు.ఇక నితిన్ హీరోగా చేసిన సై సినిమాలో నల్ల బాలు అనుచరుడి పాత్రలో రాజమౌళి కనిపించారు.రైన్ బో సినిమాలో రాజమౌళి అతిథి పాత్రలో నటించడం జరిగింది.

రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాలో అనగనగా అనే సాంగ్ లో రాజమౌళి నటించారు.బాహుబలి మొదటి భాగంలో వైన్ సెల్లర్ గా రాజమౌళి నటించారు.నాని హీరోగా చేసిన మజ్ను సినిమాలో కూడా రాజమౌళి అతిథి పాత్రలో నటించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here