Ration Card: రేషన్ కార్డులు 4 రంగులలో ఉంటాయి.. ఏ రంగు కార్డుకి ఎక్కువ ప్రయోజనాలు తెలుసా.!

Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు పేద, దిగువ మరియు మధ్యతరగతి వర్గాల కోసం అనేకరకాల పథకాలను అమలు చేసింది. భారత ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ పౌష్టికాహారం…

Ration Card: రేషన్ కార్డులు 4 రంగులలో ఉంటాయి.. ఏ రంగు కార్డుకి ఎక్కువ ప్రయోజనాలు తెలుసా.!
Ration Card: రేషన్ కార్డులు 4 రంగులలో ఉంటాయి.. ఏ రంగు కార్డుకి ఎక్కువ ప్రయోజనాలు తెలుసా.!
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు పేద, దిగువ మరియు మధ్యతరగతి వర్గాల కోసం అనేకరకాల పథకాలను అమలు చేసింది. భారత ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం కింద అర్హులైన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యంతో పాటు గోధుమ అలాగే చక్కెర ఇతర ముఖ్యమైన వస్తువులతో సహా ఆహార పదార్థాలను చౌక ధరలకే ప్రభుత్వం అందిస్తుంది. అయితే రేషన్ కార్డులు నాలుగు రకాలుగా ఉంటాయి.

రేషన్ కార్డు రంగును బట్టి వీటిని వర్గీకరిస్తారు. ఏ కలర్ రేషన్ కార్డుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో నాలుగు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆర్థిక తరగతులను ఈ నాలుగు రకాల రేషన్ కార్డులు నిర్దేశిస్తాయి. కేవలం ఆహార ధాన్యాల పంపిణీకి మాత్రమే కాకుండా సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను కూడా ఇవి నిర్దేశిస్తాయి. నాలుగు రకాల రేషన్ కార్డులు పసుపు, గులాబీ, నీలం మరియు తెలుపు రంగులో ఉంటాయి.

ఇది చదవండి: UIDAI రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయస్సును ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.!

దారిద్రరేఖకు దిగువన ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఎల్లోరేషన్ కార్డును జారీ చేస్తుంది. వీరికి గోధుమలతో పాటు బియ్యం, పప్పులు మరియు చక్కెర వంటి ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యవసర వస్తువులు కిరోసిన్ వంటివి కూడా చాలా తక్కువ ధరకు అందిస్తారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక రకాల సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డు ప్రమాణికంగా పనిచేస్తుంది. అలాగే దారిద్ర రేఖ ఎగువన ఉన్న కుటుంబాలకు గులాబీ రంగు రేషన్ కార్డు అమలు చేస్తారు.

ఈ రేషన్ కార్డు ఉన్నవాళ్లు రేషన్ షాపుల నుంచి చౌక ధరలకు ధాన్యాలు పొందవచ్చు. నీలం లేదా నారింజ రంగు రేషన్ కార్డును ఆర్థికంగా వెనుకబడి బిపిఎల్ జాబితాలో లేని వారికి మంజూరు చేస్తారు. ఈ కార్డు ఉన్నవాళ్లు పప్పులు, చక్కెర, బియ్యం మరియు గోధుమలతో పాటు కిరోసిన్ వంటివి కూడా తక్కువ ధరకు తీసుకోవచ్చు. ఇక తెల్ల రేషన్ కార్డును ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలకు అందజేస్తారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి ధాన్య సహాయం. ఈ కార్డును కేవలం కొన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకు మాత్రమే గడువు.. వెంటనే ఇంటి దగ్గర నుంచే ఇలా చేయండి

Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈ…

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి ప్రతి ఇంట్లో పండగే

Ration Card: కూటమి ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే లక్ష్యంగా…

Ration Card: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం హెచ్చరిక.. రేషన్ కార్డు ఉన్నా కూడా ఇకపై వాళ్లకు రేషన్ బియ్యం రాదు

Ration Card : రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడంలో ఖచ్చితత్వం కోసం నిరంతరం మార్పులు చేపడుతున్నారు. ప్రతి పథకం విషయంలో…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →