Sunday, September 20, 20264:50 pm
AQILIVE
Breaking News
Raaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?Actress Prema: నటి ప్రేమ రెండో పెళ్లి: సరైన వ్యక్తి దొరికితే సిద్ధమేPetrol Diesel: పెట్రోల్ డీజిల్ ఎగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం.. కొత్త రేట్లు ఇవేGold Rate Prediction: పసిడి ధరలపై కియోసాకి సంచలన అంచనా.. 30 గ్రాములు రూ.25.89 లక్షలు?Bigg Boss 10 Telugu: వైల్డ్ కార్డ్‌గా సుప్రీత ఎంట్రీ? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
తెలుగు వార్తలు » సినిమా » Childhood Pic: ఈ చిన్నారి స్టార్ హీరోయిన్ హ్యాట్రిక్ బ్యూటీని గుర్తుపట్టారా?

Childhood Pic: ఈ చిన్నారి స్టార్ హీరోయిన్ హ్యాట్రిక్ బ్యూటీని గుర్తుపట్టారా?

Childhood Pic: భీమ్లానాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ మలయాళ కుట్టి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. పవన్ కల్యాణ్, రాణా…

Published By: Gopi KrishnaUpdated On: Friday, 21 June 2024, 15:44 · 3:44 pm◷ 1 min read
⚡ HelloBD Shorts

Childhood Pic: భీమ్లానాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ మలయాళ కుట్టి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. పవన్ కల్యాణ్, రాణా హీరోలుగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త రాణా భార్యగా నటించింది. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.

Sponsored / Recommended

భీమ్లా నాయక్ మూవీ తరువాత సంయుక్త బింబిసారలో నటించి మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఈ చిత్రం హిట్ కావడంతో ఆ తరువాత సాయిధరమ్ తేజ్‌తో కలిసి విరూపాక్ష సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సైతం హిట్ సాధించడంతో సంయుక్త స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది.మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి తనకు తెలుగునాట తిరుగులేదని నిరూపించుకుంది. అనంతరం ‘సార్’లో తన నటనతో మరో మెట్టు ఎదిగింది. తన కళ్లతోనే హావభావాలు పలికిస్తూ ప్రేక్షకాదరణ పొందింది.

వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న సంయుక్తకు వెనువెంటనే అనేక సినిమా చాన్సులు వచ్చినా తప్పటడుగులు వేయకుండా ఆచితూచి సినిమాలను చూస్ చేసుకుంటోంది. డెవిల్.. ఇంగ్లిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఈ మూవీ అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. త్రిభాషా చిత్రాల్లో తిరుగులేని నాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నది. తమిళం, కన్నడ, తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉంటూనే సామాజిక మాధ్యమాల్లోనే చురుకుగానే ఉంటోంది.

Sponsored / Recommended
Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.