Yagnam Movie: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యజ్ఞం సినిమా హీరోయిన్…లేటెస్ట్ ఫోటోలు వైరల్

NEWS DESK
2 Min Read
Yagnam Movie Heroine Moon Banerjee Latest Photos Goes Viral

Yagnam Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో మొదట హీరో గా పరిచయం అయ్యారు గోపీచంద్.కానీ ఆ సినిమా తో అనుకున్నంత గుర్తింపు రాకపోవడం తో విలన్ గా నిజం,జయం,వర్షం వంటి సినిమాలలో నటించారు.అయితే విలన్ గా గోపీచంద్ కు మంచి గుర్తింపు లభించింది.ఇక ఆ తర్వాత మల్లి 2004 లో రిలీజ్ అయినా యజ్ఞం సినిమాతో హీరో గా రీ ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమా విజయం సాధించడంతో హీరో గా మళ్ళీ గోపీచంద్ కు అవకాశాలు క్యూ కట్టాయి.అయితే యజ్ఞం సినిమా హీరోయిన్ కు మాత్రం అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు అని చెప్పచ్చు.ఈ సినిమాలో శైలు పాత్రలో సమీరా బెనర్జీ నటించారు.

Yagnam Movie
Yagnam Movie

ఈ సినిమాలో సమీరా తన అందంతో గ్లామర్ తో కూడా ఆకట్టుకున్నప్పటి కి ఎందుకో ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు.ఇక ఆ తర్వాత సమీరా హిందీ లో పలు షో లలో కనిపించినప్పటికీ సక్సెస్ మాత్రం రాలేదు.దాంతో ఆమె అతి కొద్దీ సమయం లోనే ఫెడ్ అవుట్ అయిపొయింది అని చెప్పచ్చు.ఆ తర్వాత సమీరా బెనర్జీ నిర్మాత అయినా నీరజ్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Yagnam Movie Heroine Moon Banerjee
Yagnam Movie Heroine Moon Banerjee

ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.తాజాగా సమీరా కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మళ్ళీ ఆమె వార్తల్లో నిలిచింది అని చెప్పచ్చు.సమీరా లేటెస్ట్ ఫోటోలను చుసిన వారందరు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు.ప్రస్తుతం యజ్ఞం సినిమా హీరోయిన్ అంతలా మారిపోయారు అని చెప్పచ్చు.ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు సినిమాలలోకి త్వరగా రీ ఎంట్రీ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *