Vastu Tips: ఈ వస్తువులు బీరువాలో ఉంచితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. కనీస అవసరాలు పొందడానికైనా సరే డబ్బు ఉండాల్సిందే. ప్రపంచము మొత్తాన్ని ఏలుతున్నది డబ్బు అని చెప్పడంలో సందేహం లేదు. ఏదైనా కొనాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా డబ్బు చాలా అవసరం. డబ్బు ఉన్న వాళ్లకు సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం నెలకు ఎన్ని లక్షలు సంపాదించినా సరే వాళ్ళ ఇంట్లో డబ్బులు అసలు నిలవవు.

సంపాదించిన డబ్బు మాత్రం అనుకోకుండా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు సంపాదించిన దాని కంటే కూడా ఎక్కువగానే డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అవ్వకుండా ఇంట్లో నిలవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి. మన ఇంట్లో ఉండే బీరువాలో కొన్ని వస్తువులను ఉంచడం వలన కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో బీరువాను సరైన దిశలో మాత్రమే పెట్టాలి. ముఖ్యంగా నైరుతి దిశలో బీరువాను పెట్టాలి. పడమర నైరుతి లేదా దక్షిణా నైరుతి అని రెండు రకాలుగా ఉంటాయి.

అప్పుడు దక్షిణ నైరుతి దిశలో బీరువాను పెట్టుకోవాలి. బీరువా తలుపులు తెరిచినప్పుడు మీకు ఉత్తర దిక్కు ఉండాలి. కుబేరుడి స్థానం ఉత్తర దిక్కు కాబట్టి ఈ దిక్కులో ఉంచినట్లయితే ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది. చాలామంది ఒక ఎర్రటి గుడ్డను బీరువాలో పెడతారు. కానీ ఇలా చేయకూడదు. బీరువాలో తెల్లటి వస్త్రం పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వట్టివేరును నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన కూడా ఇంట్లో ఆర్థిక పరంగా ఎదుగుతారు. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇస్తూ ఉండాలి. ఇంట్లో బీరువాలో వట్టివేలు, పచ్చ కర్పూరం వంటివి పెట్టడం వలన ఆ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now