Thursday, October 29, 20269:40 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » తాజా వార్తలు » AP Inter Results 2025 Today: మరి కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. సులభంగా ఇలా చెక్…

AP Inter Results 2025 Today: మరి కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. సులభంగా ఇలా చెక్ చేసుకోండి

AP Inter Results 2025 Today: 2024-25 విద్యా విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ…

AT A GLANCE

AP Inter Results 2025 Today: 2024-25 విద్యా విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:29 · 4:29 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:29 · 4:29 pm
⚡ HelloBD Shorts

AP Inter Results 2025 Today: 2024-25 విద్యా విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు కీలక పెరగటన జారీ చేసింది. ఏప్రిల్ 12, శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

మరి కాసేపట్లో ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12, శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్ విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు అధికార వెబ్సైట్లో కాని లేదా టీవీ9 తెలుగు వెబ్సైట్లో కాని ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అలాగే ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు hi అనే మెసేజ్ పెట్టి కూడా ఫలితాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్గా మరియు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు 26 జిల్లాలలో మొత్తం 1535 కేంద్రాలలో దాదాపుగా 10,58,892 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్షలను రాయడం జరిగింది.

ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగాయి. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరగగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి మూడు నుంచి 20 వరకు జరిగాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన కేవలం 20 రోజుల్లోనే ఇంటర్ బోర్డు మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేసి ఇంటర్ బోర్డు ఫలితాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.