Arya Movie: ఆర్య సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు యెంత అందంగా మారిపోయిందో చూడండి…లేటెస్ట్ ఫోటోలు వైరల్

Arya Movie

Arya Movie: దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ఫస్ట్ సినిమా ఆర్య ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అర్జున్ కు రెండో చిత్రం, సుకుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటి వరకు తెరపై చూడని స్టోరీ, పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలతో సూపర్ హిట్ కొట్టాడు సుకుమార్. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ తో బన్నీ, సుక్కు, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్లే. అప్పటి నుంచి సుక్కు, దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చే సినిమాల్లో ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

ఈ సినిమాతో బన్నీకి నంది అవార్డు (స్పెషల్ జ్యూరీ) కూడా వచ్చింది. 52 ఫిల్మ్ ఫేర్ అవార్డులో ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సుకుమార్ అవార్డు పొందాడు. నంది స్పెషల్ జ్యూరీ సైతం అందుకున్నాడు. రూ. 4 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 2004లో సమ్మర్ హాలీడేస్ లో రిలీజై దాదాపు రూ. 30 కోట్లు కలెక్ట్ చేసింది. మలయాళంలో డబ్ చేయగా రూ 35 లక్షలు తెచ్చి పెట్టింది. ఈ మూవీతో అల్లు అర్జున్‌ మలయాళంలో మల్లు అర్జున్‌గా మారిపోయాడు. ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ గా నిలచింది.

Also Read : వైట్ డ్రెస్సులో అందాలను అరబోసిన కాజల్ అగర్వాల్…వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

Arya Movie
Shravya

ఇందులో హీరో క్యారెక్టర్ కు పిల్లల గ్యాంగ్ ఉంటుంది. ఆ పిల్లల గ్యాంగ్‌లో అందరి కన్నా కాస్త పెద్దగా ఓ పాప ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకొని హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందా.
ఆ అమ్మాయి పేరు శ్రావ్య. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గా యాక్ట్ చేసిన హీరో రాహుల్ తో కలిసి ఓ సినిమా చేసింది.

Also Read : వామ్మో.. షాక్ అయ్యేలా మారిపోయిన విశాల్ భరణి సినిమా హీరోయిన్..లేటెస్ట్ ఫోటోలు వైరల్

Arya Movie
Shravya

లవ్ యు బంగారం సినిమాతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కన్నడ సినిమా రోజ్ తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ హీరో నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోం మూవీలో హీరోయిన్‌గా చేసింది. తమిళంలో పగిరి, విలాయట్టు ఆరంభం తదితర చిత్రాలు చేసింది. 2018లో వచ్చిన వచ్చిన మసకలిలో కనిపించింది ఈ తెలుగుమ్మాయి. ఆమె సోదరి కూడా చైల్డ్ ఆర్టిస్టే. మల్లీశ్వరి సినిమాలో నటించింది. వీరిద్దరూ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రావ్య చేస్తున్న కొత్త సినిమాలేమీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన టూర్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. అప్పటి కన్నా ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *