Actress Muktha: వామ్మో.. షాక్ అయ్యేలా మారిపోయిన విశాల్ భరణి సినిమా హీరోయిన్..!

Actress Muktha
Actress Muktha
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedAug 27 · 2:51 PM

Reading2 min

Reader Tools

Actress Muktha: తెలుగు కుటుంబానికి చెందిన హీరో విశాల్ తమిళ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాలను తెలుగులోనూ డబ్ చేసి సూపర్ హిట్లు కొట్టాడు. హీరో విశాల్ కు పందెం కోడి సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి తన ప్రతి సినిమాను తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు విశాల్.తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి సంచలన విజయం సాధించింది భరణి సినిమా. ఈ సినిమా కూడా విశాల్ మాస్ హీరోయిజం ను మరింత ఎలివేట్ చేసింది. తమిళంలో ‘తామిరపరణి’ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో హీరోయిన్ గా కేరళ కుట్టి భాను ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ భామ అసలు పేరు ఎల్జా జార్జ్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుంది. మలయాళ సినిమాల్లో ముక్త గా పరిచయమమైంది. కానీ తమిళంలో మాత్రం భాను గా ప్రేక్షకులకు చేరువైంది. తామీరపరణి భానుగా అభిమానులు ఆమెను ముద్దు గా పిలుచుకుంటారు.

ఆ తర్వాత తమిళంలో సినిమా అవకాశాలు లేకపవడంతో మాలీవుడ్ పై దృష్టి పెట్టింది. తర్వారత కొద్ది రోజులకు తమిళంలో చేరన్ సరసన ‘అజగర్ కొట్టి’, ‘త్రీ పియర్ త్రీ కాదల్’ చిత్రాల్లో కనిపించినా అవి అంతగా ఆడలేదు. మరి కొన్ని తమిళ సినిమాలు చేసినా ఆమె కెరీర్ మాత్రం హెల్ప్ కాలేదు. భాను అలియాస్ ముక్త 2015లో రింగు టోమీ అనే బిజినెస్ మెన్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికో కూతురు ఉంది.

పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న భాను.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు కమిట్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురితో కలిసి డాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నది. తాజాగా భాను ఓ మాస్ డాన్స్ తో ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ మారింది. భరణి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన భాను మాస్ డ్యాన్స్ అరాచకం సృష్టిస్తున్నది. ఆమె మాస్ అవతారాన్ని చూసి ఫాలోవర్లు ఆశ్చర్యపోతున్నారు. సాఫ్ట్ క్యారెక్టర్లు చేసిన భాను డ్యాన్స్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Muktha (@actressmuktha)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →