Free Cylinder News: గ్యాస్ సిలిండర్ వాడే వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మీరు ఈరోజు నుంచి ఉచితంగా రెండవ సిలిండర్ పొందవచ్చు. ఈరోజు నుంచి రెండో విడత ఫ్రీ సిలిండర్ బుకింగ్ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాదికి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.
ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి సిలిండర్ ప్రక్రియ పూర్తయింది. ఇక రెండవ ఉచిత సిలిండర్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలందరూ ఈరోజు నుంచి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించారు.
ఎల్పిజి కనెక్షన్ కలిగి ఉన్న మహిళలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో రైస్ కార్డు అనుసంధానం అయివున్న వాళ్లకు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ను ప్రభుత్వం అందిస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్న కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
Aslo Read: త్వరలో ATM సైజ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. కేవలం వాళ్లకు మాత్రమే ఈ కార్డులు
కూటమి ప్రభుత్వం ఒక ఏడాదిలో మహిళలకు మూడూ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది. అయితే ఈ మూడు సిలిండర్ లను ఒకేసారి కాకుండా సంవత్సరంలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ అందిస్తుంది.
ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెల నుంచి జూలై నెల మధ్యలో ఒక సిలిండర్ అలాగే ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల మధ్యలో ఒక సిలిండర్ మరియు డిసెంబర్ నెల నుంచి మార్చి నెల మధ్యలో ఒక సిలిండర్ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా గ్యాస్ బుక్ చేసి ఉచిత సిలిండర్ను పొందవచ్చు. ఈరోజు నుంచి ఉచిత గ్యాసస్తులుండారు బుక్ చేసుకున్న వాళ్ళ అకౌంట్లో 24 గంటల్లోపు నగదు జమ చేయబడుతుంది.