Todays Gold Rate: మహిళలకు శుభవార్త.. భారీగా దిగొస్తున్న పసిడి ధరలు.. గత 10 రోజులలో బంగారం ధర ఎంత తగ్గిందంటే

Todays Gold Rate: గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ వారి వివాదం సద్దుమణుగుతున్న క్రమంలో బంగారం రేటు కూడా తగ్గుతుంది. గత కొన్ని రోజుల…

Todays Gold Rate
Todays Gold Rate
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Todays Gold Rate: గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ వారి వివాదం సద్దుమణుగుతున్న క్రమంలో బంగారం రేటు కూడా తగ్గుతుంది. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పట్టాయి. తాజాగా పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కావడంతో ఈ నేపథ్యంలో బంగారం తగ్గుతూ ఉండడంతో మహిళ లకు ఊరట లభించింది. ఈరోజు శుక్రవారం ఉదయం మన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరపై రూ.220 రూపాయలు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర పై రూ.200 తగ్గినట్టు తెలుస్తుంది.

ఇక గడిచిన 10 రోజులలో స్వచ్ఛమైన బంగారం తులం రూ.5,678 తగ్గింది. పసిడి ధరలు ఇలా ఉంటే మరోవైపు వెండి ధర మాత్రం. ఈరోజు కిలో వెండిపై 2000 రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయిన హైదరాబాదు తో పాటు విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు హైదరాబాద్ నగరంలో రూ.87,550, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ.95,510 గా ఉన్నాయి.

ఇక ఢిల్లీ నగరంలో అయితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,700 అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రు.95,660 గా ఉన్నాయి. ఇక ముంబై, బెంగళూరు మరియు చెన్నై నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.87,550 గా ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రు.95,510 గా ఉంది. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు అయినా హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం లో ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. ఈ ప్రాంతాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,09,000 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →