Home » బిజినెస్ » Ration Card: రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను ఇంటి నుంచే ఇలా సులభంగా చేసుకోండి

Ration Card: రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను ఇంటి నుంచే ఇలా సులభంగా చేసుకోండి

Ration Card
Ration Card

Ration Card: ఇప్పటికీ కూడా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మీరు ఇంటి నుంచి కూడా రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డును మరియు ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాలని కోరింది. దీనికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మార్చి 31, 2025 వరకు చివరి తేదీగా నిర్ణయించారు.

తాజాగా ఈ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. గడువు పూర్తయ్యే లోపు రేషన్ కార్డులు ఉన్నవాళ్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. లేకపోతే వారి రేషన్ కార్డులు పనిచేయవు అని తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు మీ రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇప్పుడు ఇంటి నుంచే ఆ ప్రక్రియను చేయవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఇప్పుడున్న రోజుల్లో మారుతున్న కాలానుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే అవసరమైన సేవలను ఇంటి నుంచే పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వీటిలో ఒకటి ప్రస్తుతం ఆధార్ కార్డు సహాయంతో రేషన్ కార్డులో మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం. నీ పేరు రేషన్ కార్డు జాబితాలో ఉందో లేదో సింపుల్గా ఇలా తెలుసుకోండి.

అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సేవ అందుబాటులో ఉంది. మీ ఆధార్ కార్డును దగ్గర పెట్టుకొని స్మార్ట్ ఫోన్ లో లేదా లాప్టాప్ లో ఈ ప్రక్రియను ఈజీగా చూసుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ అధికార వెబ్సైట్ లోకి వెళ్లి స్టేట్ ఫుడ్ హోటల్స్ అనే ఆప్షన్స్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ను నమోదు చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఆప్షన్ ను ఎంచుకోండి.

మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసిన తర్వాత వివరాలను సమర్పించండి. సంబంధిత రేషన్ కార్డు నుంచి సమాచారం మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో మీకు మీ ఇంటి యజమాని పేరు, కార్డు నెంబరు, ఇంటి చిరునామాతో పాటు ఇంటి సభ్యుల సమాచారం మొత్తం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వ వెబ్సైట్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. పీక్ అవర్స్ సమయంలో ఇది సమస్య కలిగేలా చేస్తుంది. ఈ క్రమంలో మీరు రాత్రిపూట ఈ సేవను ఉపయోగించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట సమయంలో సర్వర్ పై లోడ్ తక్కువగా ఉంటుంది.