Business Idea: ఈ మధ్యకాలంలో ప్రజలు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మంచిదైన ఆహారాన్ని సేకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ తింటూ ఉంటారు. అయితే స్నాక్స్ కు పెరుగుతున్న డిమాండ్ ప్రకారం ఒకప్పటి సంప్రదాయ విషయాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. వీటిలో మఖన మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఇంట్లో కూడా మఖన కనిపిస్తుంది. మఖాన బీహార్ రాష్ట్రంలో పండించే పంట. మఖాన సాంప్రదాయ పంటగానే కాకుండా గొప్ప వ్యాపారం గా కూడా నేడు మారింది. మఖన కు నేడు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కూడా బాగా డిమాండ్ ఉంది.
మీరు కూడా మఖాన వ్యవసాయంతో మంచి లాభాలను పొందవచ్చు. వీటిలో ప్రోటీన్, ఆంటీ ఆక్సిడెంట్ లో మరియు ఫైబర్లు ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన చిరుతిండిగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శాఖాహారులు మరియు గ్లూటేన్ రహిత ఆహారం తీసుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఈ పంట భారత దేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారు. వీటిని ఎక్కువగా చెరువులు, సరస్సులు మరియు చిత్తడి నేలలలో సాగు చేస్తారు. వెచ్చని, తేమతో కూడిన వాతావరణం దీనికి అవసరం. ఇది పండించడానికి 20 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. అలాగే బంకమట్టి నేల, నీటిని నిలుపుకునే లాగా ఉండాలి.
ఒక ఏడాది పాటు నీరు ఉండేలాగా చెరువు లేదా చిత్తడి నేలను తీసుకోవాలి. ఈ నేల లోతు 1.5 నుంచి 2.5 అడుగులు వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల మధ్యలో అధిక నాణ్యత గల విత్తనాలు లభిస్తాయి. నాటిన తర్వాత మొక్కల మధ్య దూరం ఉండేలాగా చూసుకోవాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ పంట అభివృద్ధికి ఆరు నెలలు పడుతుంది. మఖన పంట సెప్టెంబర్ నుంచి నవంబర్ నెల మధ్యలో సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలను తీసి ఎండలో ఎండబెట్టిన తర్వాత మార్కెట్లో విక్రయించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఈ పంట ద్వారా అధిక లాభాలను పొందొచ్చు.