Thursday, October 29, 20269:41 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » తాజా వార్తలు » Central Home Minister: సింధూ నది నుంచి చుక్కనీరు కూడా పాక్ కు వెళ్లకుండా ప్లాన్…

Central Home Minister: సింధూ నది నుంచి చుక్కనీరు కూడా పాక్ కు వెళ్లకుండా ప్లాన్ వేసిన కేంద్ర ప్రభుత్వం

Central Home Minister: ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారతదేశం కేంద్ర ప్రభుత్వం…

AT A GLANCE

Central Home Minister: ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారతదేశం కేంద్ర ప్రభుత్వం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:29 · 4:29 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:29 · 4:29 pm
⚡ HelloBD Shorts

Central Home Minister: ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారతదేశం కేంద్ర ప్రభుత్వం పాక్ తో జరిగే సింధు నది జలల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పాక్ దేశానికి సింధూ నది నుంచి ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా పూర్తిగా కట్టడి చేసేందుకు భారత కేంద్ర ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నది జిల్లాలపై ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఉన్నత అధికారులతో సమావేశం జరిపారు.

ఈ సమావేశంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అప్పట్లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన సింధూ నది నీటి ఒప్పందాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత్ నుండి పాకు కు సింధు నది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరకుండా మూడు దశలలో పక్కా ప్లాన్ వేయాలని సూచించారు. వరల్డ్ బ్యాంకు ముందుగా మన దేశ వైఖరిని తెలుపాలని ఆయన సూచించారు. 1960 సెప్టెంబర్ లో మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధూ నది నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది.

ఈ రెండు దేశ మధ్య నీటి ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం లెక్కల ప్రకారం తూర్పున ఉన్న రావి,సాట్లేజ్, బియాస్ నదులపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కు సింధు, చినాబు, జీలం నదులపై బాధ్యతను అప్పగించారు. అప్పట్లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. భారత్ 1948లో పాకిస్తాన్ దేశానికి నీటిని నిలిపివేసింది. ఆ తర్వాత మళ్లీ ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంతో నీటి జలాలపై మళ్ళీ ఇరుదేశాలు ఒప్పందం కుదురుచుకున్నాయి. ఆ ఒప్పందం లో భారత్కు సింధూ నదిలో 20% నీరు అలాగే మిగిలిన 80 శాతం జలాలను పాకిస్తాన్ వినియోగించుకునే లాగా అప్పట్లో వెసులుబాటును కల్పించారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.