Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిత్యం చేసే పనులలో కూడా చిన్నచిన్న వాస్తు దోషాలు ఉంటాయి. అయితే మనకు తెలియకుండానే ఈ చిన్న చిన్న వాస్తు దోషాలు మన జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలను పాటించినట్లయితే పేదరికం దూరం ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం దిండు కింద డబ్బులను పెట్టుకోవడం అలాగే పుస్తకాలు వంటివి బెడ్ పై పెట్టడం వంటివి శుభప్రదం కాదు. పక్కన నీటిని పెట్టుకుని నిద్రించడం కూడా దురదృష్టానికి దారితీస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం వలన ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి.
ఈ చిన్న చిన్న పొరపాట్లను మానుకున్నట్లయితే మరింత అదృష్టం కలుగుతుంది. వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయాలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం చాలా మంచిది.వాస్తు శాస్త్ర నియమాలు మన జీవితాన్ని అలాగే మన ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం మాత్రమే కాకుండా నిత్యం చేసే ప్రతి పనిలో కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా అవసరం. వాస్తు సరిగ్గా లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాభం ఉండదు. సంపాదించిన డబ్బు కూడా నిల్వ ఉండకుండా ఖర్చు అయిపోతుంది. కొన్నిసార్లు వాస్తు నియమాలను పాటించకపోతే పేదరికం కలుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.
ఒకవేళ వాస్తు నియమాలను సరిగ్గా పాటించినట్లయితే పేదరికంలో ఉన్నవారు కూడా ధనవంతులుగా మారుతారని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. నిత్యం రోజువారి చేసే పనులలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. రోజు చేసే కొన్ని తప్పుల కారణంగా ప్రతి కుల శక్తులు పెరుగుతాయి. కానీ ఇంట్లో కొన్ని పనులను చేయడం వలన సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ఈ పనులు వ్యక్తిగత మరియు ఆర్థిక అభివృద్ధికి కూడా చాలా దోహదం చేస్తాయి. కొంతమంది నిద్రపోయేటప్పుడు దిండు కింద డబ్బులను పెడుతుంటారు. కానీ ఇది శుభం కాదు. ఇలా చేయడం వలన అదృష్టం దూరం అవుతుంది. కొంతమంది నిద్రలోకి వెళ్లే ముందు పుస్తకాలను చదువుతూ ఉంటారు. ఆ తర్వాత పుస్తకాలను బెడ్ పై పెట్టి నిద్రపోతారు. ఇలా చేయడం కూడా శుభ ప్రదం కాదు. కొంతమంది పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని నిద్రపోతారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి నిత్యం చేసే కొన్ని పనులు అదృష్టానికి ఆటంకం కలిగిస్తాయి.