Actress Laya: ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లయ తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్ లయ ఎల్లప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరోయిన్ లయ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది లయ. ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. హీరో వేణు తొట్టెంపూడి కి జోడిగా స్వయంవరం సినిమాతో లయ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
నటిగా మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా లయ టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆమె తెలుగులో హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వరుస అవకాశాలతో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయింది. హీరోయిన్ లయ 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేసన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత లయ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఈ దంపతులకు ఒక పాప మరియు బాబు ఉన్నారు. తాజాగా లయ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో లయ కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం లయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram