Sukumar Family: పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Sukumar Family: పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సుకుమార్.ఇప్పటి వరకు సుకుమార్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు.అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయం సాధించింది.

దాంతో సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.ఇక సుకుమార్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.

సుకుమార్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.తాజాగా సుకుమార్ కూతురు సుకృతి వేణి పుట్టిన రోజు వేడుక చాల ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది.ఈ వేడుకకు సంబంధించిన కొన్ని సుకుమార్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment