Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. గత వారం స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనే దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనిపిస్తున్న తగ్గుదల ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడుతోంది.
సెప్టెంబర్ 14న కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు దిగిరావడంతో పండుగ సమయంలో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఇది అనుకూల పరిణామంగా మారింది. వచ్చే నెలలో దసరా కూడా ఉండటంతో తాజా ధరలపై కొనుగోలుదారులు ఆసక్తిగా చూస్తున్నారు.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఈ ధర రూ.490 తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. ఈ రేటు రూ.450 మేర తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
Also Read: Gold Price Today: కొనుగోలుదారులకు ఊరట.. సెప్టెంబర్ 13న బంగారం, వెండి ధరలు ఇవే
చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో గోల్డ్ రేట్లు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,250గా ఉంది.
బెంగళూరులోనూ 24 క్యారెట్ల బంగారం రూ.1,54,090 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,250గా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,240గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా తగ్గుముఖం
బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.50 లక్షలకు లభిస్తుండగా, చెన్నైలో కూడా కిలో ధర రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరగడం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంటున్నారు.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, దేశీయ మార్కెట్లోనూ అదే ప్రభావం కనిపిస్తోంది.