Tuesday, October 20, 20267:26 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజుల్లో భారీగా తగ్గిన…

Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజుల్లో భారీగా తగ్గిన పసిడి ధర.. ఈరోజు ధరలు ఇవే

Todays Gold Rate: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ కనిపిస్తుంది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలో తగ్గింపు…

AT A GLANCE

Todays Gold Rate: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ కనిపిస్తుంది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలో తగ్గింపు…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Todays Gold Rate: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ కనిపిస్తుంది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలో తగ్గింపు కనిపించింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం ధర కిందకు దిగుతుంది. ఏప్రిల్ 7, 2025 సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గింది.

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 తగ్గినట్లు సమాచారం. దీంతో ఈ గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 3 వేలకు పైగానే తగ్గింది. వెండి ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతూ కనిపిస్తుంది. ఈ గడిచిన నాలుగు రోజుల్లో ఔన్సు గోల్డ్ పై సుమారు 100 డాలర్కు పైగానే తగినట్లు సమాచారం.

ఇది చదవండి: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం హెచ్చరిక.. రేషన్ కార్డు ఉన్నా కూడా ఇకపై వాళ్లకు రేషన్ బియ్యం రాదు

బంగారం మరియు వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధర తగ్గింది. ఈ ప్రధాన నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,380కు పడిపోయింది.

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రు. 82,850కు దిగింది. ముంబై బెంగళూరు మరియు చెన్నై నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,380 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రు. 82,850 గా ఉంది. అలాగే ఈరోజు హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో వెండి ధరలో ఎటువంటి మార్పులు జరగలేదు. ఈ నగరాలలో కిలో వెళ్లి ధర రూ.1,03,000 కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు నగరాలలో కిలో వెండి ధర రూ.94,000 గా ఉంది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.