Tuesday, October 20, 20266:35 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Milk Price: భారీగా పెరిగిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలు.. కొత్త ధరలు…

Milk Price: భారీగా పెరిగిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలు.. కొత్త ధరలు ఇలా ఉన్నాయి

Milk Price: రోజురోజుకు పాల ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. నిరంతరం పాలధారులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజల నెలవారి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. వేతన జీవుల జేబులకు చిల్లులు…

AT A GLANCE

Milk Price: రోజురోజుకు పాల ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. నిరంతరం పాలధారులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజల నెలవారి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. వేతన జీవుల జేబులకు చిల్లులు…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Milk Price: రోజురోజుకు పాల ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. నిరంతరం పాలధారులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజల నెలవారి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. వేతన జీవుల జేబులకు చిల్లులు పడే సందర్భం ఏర్పడింది. తాజాగా విజయ డైరీ మరోసారి పాల ధరను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య తాజాగా పాల ధరల సవరణ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గేదె పాల ధరలు పెరగగా, ఆవుపాల ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ధరల ప్రకారం ఏడు శాతం వెన్న శాతం ఉన్న గేదె పాల ధర లీటరుకు 56 రూపాయల నుంచి 59.50 కి పెరిగింది.

10 శాతం వెన్న ఉన్న గేదెపాల ధర 80 రూపాయల నుంచి 84 రూపాయలకు పెరిగింది. అలాగే మూడు శాతం వెన్న ఉన్న ఆవుపాల ధర 40 రూపాయల నుంచి 36 రూపాయలకు తగ్గింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి విజయ డైరీ ప్రస్తుతం ప్రతిరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది.

ఇది చదవండి: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం హెచ్చరిక.. రేషన్ కార్డు ఉన్నా కూడా ఇకపై వాళ్లకు రేషన్ బియ్యం రాదు

ఇందుకుగాను రైతులకు రూ. 1.5 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ధరల సవరణ అవసరమని విజయ డైరీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విజయ డైరీ తీసుకున్న ఈ నిర్ణయంతో గేదెపాలు విక్రయించే రైతులకు లాభం చేకూరుతుంది. ఆవు పాలు గ్రహించే రైతులు నష్టపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గేదెపాల ధర పెరిగి ఆవుపాల ధరలు తగ్గడంతో రైతుల్లో అసంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా రైతులు ఈ ధరల తగ్గింపును ఆర్థికంగా భరించలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైతులందరూ గేదెపాలధర పెంచారు కదా ఆవు కాల ధరను పెంచకుండా ఉండాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.