Post Office RD Scheme: రోజుకు కేవలం రూ.100 పొదుపుతో చేతికి భారీ రిటర్న్స్.. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బంపర్ స్కీం ఇదే

Post Office RD Scheme: మీరు కేంద్ర ప్రభుత్వ హామీతో ఉన్న ఏదైనా మంచి పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకం చాలా మంచి పథకం అని చెప్పొచ్చు. ఈ…

Post Office RD Scheme
Post Office RD Scheme
STORY SNAPSHOT

What you need to know

Deskబిజినెస్

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:30 PM

Reading2 min

Reader Tools

Post Office RD Scheme: మీరు కేంద్ర ప్రభుత్వ హామీతో ఉన్న ఏదైనా మంచి పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకం చాలా మంచి పథకం అని చెప్పొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన మీరు మెచ్యూరిటీ సమయానికి అద్భుతమైన రాబడినీ అందుకోగలుగుతారు. సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ లో అనేక బెస్ట్ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకాలలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం మీరు ఈ పథకంలో రోజుకు 100 రూపాయలు పెట్టుబడి చేయడం వలన భారీ రాబడి అందుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి నెల కొంత అమౌంట్ డిపాజిట్ చేయడం వలన భారీ వడ్డీ పొందవచ్చు. ఈ పథకం ప్రభుత్వ హామీతో ఉన్న పథకం కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు పెట్టుబడి పెడుతూ ఉండాలి. చిన్న మొత్తంలో కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ఎటువంటి రిస్కు ఉండదు. ఏడాదికి మీకు 6.7% వడ్డీ రేటు లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. చిన్న చిన్న సేవింగ్స్ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా అద్భుతమైన పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు రోజుకు కేవలం 100 రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల 3000 రూపాయలు డిపాజిట్ చేసినట్లు. ఇక ఈ విధంగా ఐదేళ్లపాటు మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం రూ.1,80,000 అవుతుంది. దీనిపై మీకు 6.7% వడ్డీ రేటుతో రూ.34,097 వడ్డీ పొందవచ్చు. ఇక ఐదేళ్ల కాలం పూర్తి అయిన తర్వాత మీరు మొత్తం రూ.2,14,097 భారీ మొత్తాన్ని చేతికి అందుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Post Office Scheme: దంపతుల కోసం పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. తక్కువ పొదుపుతో ప్రతి నెల రూ.9,250 మీ సొంతం

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →