Tuesday, October 20, 20268:06 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » AP New Ration Cards: త్వరలో ATM సైజ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు…

AP New Ration Cards: త్వరలో ATM సైజ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. కేవలం వాళ్లకు మాత్రమే ఈ కార్డులు

AP New Ration Cards: ఏపీ రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఆధునిక రేషన్ కార్డులు జారీ చేస్తామని అలాగే ధాన్యం కొనుగోలు, స్మగ్లింగ్ నియంత్రణ, రైతుల సాయం వంటి చర్యలను కూడా…

AT A GLANCE

AP New Ration Cards: ఏపీ రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఆధునిక రేషన్ కార్డులు జారీ చేస్తామని అలాగే ధాన్యం కొనుగోలు, స్మగ్లింగ్ నియంత్రణ, రైతుల సాయం వంటి చర్యలను కూడా…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

AP New Ration Cards: ఏపీ రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఆధునిక రేషన్ కార్డులు జారీ చేస్తామని అలాగే ధాన్యం కొనుగోలు, స్మగ్లింగ్ నియంత్రణ, రైతుల సాయం వంటి చర్యలను కూడా చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉన్న కొత్త రేషన్ కార్డులను ప్రజలకు జారీ చేయబోతున్నట్లు తెలిపారు. కొత రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లు వంటి ఆధునిక సదుపాయాలతో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంగా తెలిపారు.

Also Read: UIDAI రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయస్సును ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.!

ఈ వార్తతో ఏపీ ప్రజలకు భారీ ఊరట కలగనుంది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. తమకు నచ్చిన మిల్లుకు తీసుకొని వెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు.

అలాగే వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం విక్రయం ప్రారంభమైందని, ఇప్పటివరకు ఇందులో 16 వేల మంది రైతులు భాగస్వామ్యం అయ్యారని, దాంతో ధాన్యం విక్రయం సులభం అయ్యిందని మంత్రి చెప్పుకొచ్చారు.

రైతులకు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలను కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యాన్ని గోదాముల వద్ద నిలువచేసి, ప్యాకింగ్ చేయించే కార్యక్రమం కొనసాగుతుంది.

అలాగే రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం స్మగ్లిన్ పై కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసిన వారికి పీడీ యాక్ట్ కింద కఠిన శిక్షలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.