Tuesday, October 20, 20267:26 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » బిజినెస్ » Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లు మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి..…

Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లు మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.. లేకపోతే మీ రేషన్ కార్డ్ పనికిరాదు

Ration Card: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు కీలక అప్డేట్ ను జారీ చేసింది. 2025 మార్చి 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే సబ్సిడీపై వచ్చే ఆహార ధాన్యాల సౌకర్యం…

AT A GLANCE

Ration Card: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు కీలక అప్డేట్ ను జారీ చేసింది. 2025 మార్చి 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే సబ్సిడీపై వచ్చే ఆహార ధాన్యాల సౌకర్యం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:30 · 4:30 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:30 · 4:30 pm
⚡ HelloBD Shorts

Ration Card: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు కీలక అప్డేట్ ను జారీ చేసింది. 2025 మార్చి 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే సబ్సిడీపై వచ్చే ఆహార ధాన్యాల సౌకర్యం కోల్పోతారని తెలిపింది. అయితే ఇంకా ఈ ప్రక్రియను 7.55 లక్షల మంది పూర్తి చేయలేదు అని తెలుస్తుంది. రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉన్నవాళ్లు మార్చి 31 2025 నాటికి ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లేకపోతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యాన్ని కోల్పోతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం ఇంకా 7.55 లక్షల మంది ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని తెలుస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో మోసాలు మరియు నకిలీ కార్డుదారులను గుర్తించేందుకు ఈ కేవైసీని ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కేవైసీ ద్వారా ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీపై ఆహారం అందేలా చూస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులు మరియు నకిలీ రేషన్ కార్డుదారులు తొలగిపోయేలా ప్రభుత్వం చేస్తుంది.

ఇప్పటివరకు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయనివారు కచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. రేషన్ దుకాణంలో లేదా ఆన్లైన్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వాళ్ళు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇంకా అసంపూర్ణంగా సమాచారం ఉన్నవాళ్లు తొందరగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అయితే ఈ కేవైసీ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులభం అని తెలుస్తుంది. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు మరియు బయోమెట్రిక్లను అందిస్తే సరిపోతుంది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.