Tuesday, October 20, 20262:14 pm
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » ఆధ్యాత్మికం » Solar Eclipse 2025: ఈనెల మార్చి 29న సూర్యగ్రహణం.. దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో…

Solar Eclipse 2025: ఈనెల మార్చి 29న సూర్యగ్రహణం.. దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుందో తెలుసా.!

Solar Eclipse 2025: భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు…

AT A GLANCE

Solar Eclipse 2025: భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 12 September 2026, 16:28 · 4:28 pm◷ 2 min read
UpdatedSaturday, 12 September 2026, 16:28 · 4:28 pm
⚡ HelloBD Shorts

Solar Eclipse 2025: భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనిపించడు. దీనినే మనము సూర్యగ్రహణం అని అంటాము. అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ప్రతి అమావాస్యకు కూడా గ్రహణాలు ఏర్పడవు. ఇక ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది.

అయితే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుని కాంతిని పాక్షికంగా అడ్డుకొని సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే భూమిపై కనిపించేలా చేస్తాడు. ఈ క్రమంలో సూర్యుడు నెలవంక ఆకారంలో కనిపిస్తాడు. ఖగోళ అద్భుతం ఏ ఏ ప్రాంతాల్లో కనిపించబోతుందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న ఏర్పడే సూర్యగ్రహణం దాదాపు రెండు గంటలపాటు ప్రత్యక్షం కానుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:13 వరకు ఉంటుంది.

ఇది చదవండి: మీకు అరచేతిలో దురదగా అనిపిస్తుందా.. నిజంగానే డబ్బులు వస్తాయా.. తెలుసుకోండి

అయితే ఈ సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. ఇది ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని కొన్ని ప్రాంతాలలో నివసించే వారికి ప్రత్యేకంగా మంచి వ్యూ కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికా, సైబీరియా, కరేబియన్, యూరోప్ లోని కొన్ని ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలంటే కొన్ని రక్షణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి.

ఇది చదవండి: పొరపాటున కూడా ఈ వస్తువులను అప్పుగా తీసుకోకూడదు.. లేదంటే భారీ ఆర్థిక నష్టం తప్పదు.!

అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం భారత్ పై లేనందున సూతక కాలం కూడా వర్తించదు. అయితే శాస్త్రం ప్రకారం సూతక్ కాలం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. గ్రహణకాలం పూర్తిగా ముగిసిన తర్వాత ఈ కాలం ముగుస్తుంది. కేవలం గ్రహణం కనిపించే ప్రదేశాలలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు అంటే నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మార్చి 14న మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం జరిగింది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.