Tuesday, October 20, 20268:57 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » సినిమా » Balakrishna – Venkatesh: ఒకే కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల…

Balakrishna – Venkatesh: ఒకే కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా.!

Balakrishna – Venkatesh: ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యి స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం…

AT A GLANCE

Balakrishna – Venkatesh: ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యి స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం…

Published By: Gopi KrishnaUpdated On: Saturday, 9 November 2024, 15:04 · 3:04 pm◷ 2 min read
⚡ HelloBD Shorts

Balakrishna – Venkatesh: ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యి స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు చాల సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ.అలాగే డి రామానాయుడు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.

ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఒకే తరహా కథతో,ఒకే రోజు విడుదల అయ్యి పోటీపడ్డారు.సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాల మంది స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ ఒకే తరహా కథతో ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు హీరోల సినిమాలు గందరగోళం సృష్టించాయి.ఆ సినిమాలు బాలకృష్ణ హీరోగా చేసిన అశోక చక్రవర్తి మరియు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ధ్రువ నక్షత్రం.

మలయాళంలో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఆయన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం అశోక చక్రవర్తి.ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1989 జూన్ 29 న రిలీజ్ అయ్యింది.ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబడింది.అలాగే వై నాగేశ్వర రావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం ధ్రువ నక్షత్రం.ఈ చిత్రం కూడా 1989 జూన్ 29 న రిలీజ్ అయ్యింది.ఇక ఒకే తరహా కథతో,ఒకే రోజు విడుదల అయినా ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలలో వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా సూపర్ హిట్ అయితే,బాలకృష్ణ సినిమా అశోక చక్రవర్తి బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ గా నిలిచింది.

Story Trail

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.