Home సినిమా ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు ఒక స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టగలరా…

ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు ఒక స్టార్ హీరో…ఎవరో గుర్తుపట్టగలరా…

1
0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డి.రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో హిట్ సినిమాలు అందుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు వెంకటేష్.అయితే వెంకటేష్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఒక సినిమాలో చేశారు అనే సంగతి చాల తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలోకి వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు అన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే కలియుగ పాండవులు వెంకటేష్ మొదటి సినిమా కాదు.ఈ సినిమా కు ముందు వెంకటేష్ ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన ప్రేమ్ నగర్ అనే సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించమని డి రామానాయుడు గారు వెంకటేష్ ను అడిగారట.

Daggubati Venkatesh
Daggubati Venkatesh

ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తానని రామానాయుడు గారు వెంకటేష్ కు చెప్పారట.దాంతో సరే అని వెంకటేష్ ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ తర్వాత కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా చేసారు వెంకటేష్.ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఖుష్బూ నటించారు.అయితే ఖుష్బూ తండ్రికి ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు.కానీ అప్పట్లో శ్రీదేవి,జయప్రద రాఘవేంద్ర రావు గారి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్నారు.దాంతో ఎలాగైనా ఖుష్బూ కలియుగ పాండవులు అనే సినిమా చేయాలనీ అనుకున్నారు.1986 లో రిలీజ్ అయినా సినిమా మంచి విజయం సాధించడం జరిగింది.

Previous articleబాలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…
Next articleచిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఆ అక్షరంతో వచ్చిన సినిమాలు ఎన్నో తెలుసా…వాటిలో ఏది హిట్…ఏది ప్లాప్ అంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here