Vaibhav Suryavanshi: వైభవ్ సక్సెస్ వెనుక అతని తల్లితండ్రులు ఎంత కష్టపడ్డారో తెలుసా..!

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: పిల్లల సక్సెస్ లో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అతి చిన్న వయసులోనే ఐపిఎల్ 25 లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ గురించి అందరికీ తెలిసిందే. వైభవ్ సూర్య వంశి సక్సెస్ లో అతని తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంది. వైభవ్ సూర్యవంశం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 25 లో డు ఆర్ డై మ్యాచ్లో కేవలం 35 బాల్స్ లో సెంచరీ పూర్తి చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. వైభవ్ తల్లిదండ్రులు తన కష్టం, ఆస్తి, సమయం, ఆశ అన్నీ కూడా తన కొడుకు భవిష్యత్తు మీదనే పెట్టుకున్నారు. తమ కొడుకు సక్సెస్ కాకపోతే తమకు మరో దారి లేదు అని తెలిసి కూడా వాళ్ళు ఇంత పెద్ద రిస్క్ చేశారు.

వైభవ్ ను క్రికెటర్ గా క్రికెటర్ గా చేసేందుకు తమకున్న పంట పొలాన్ని కూడా అతని తల్లిదండ్రులు అమ్మేశారు. ఒకవేళ వైభవ్ సక్సెస్ కాకపోతే తమ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నకు కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్లకు తెలిసిందల్లా తమ కొడుకు భవిష్యత్తు. తమకున్న ఆ చిన్న ధైర్యంతోనే తన కొడుకును క్రికెట్ చేయాలని అనుకున్నారు. తమ వృత్తి, తమ జీవితం మొత్తం కూడా తమ కొడుకు వైభవ్ క్రికెట్ అన్నట్లుగా తల్లిదండ్రులు కలలు కన్నారు. వైభవ్ పాట్నాలో ఉన్న సమయంలో పదేళ్ల వయసులో ప్రతిరోజు 600 బాల్స్ ప్రాక్టీస్ చేసేవాడట. అప్పట్లో వైభవ్ 16 లేదా 17 ఏళ్ల బౌలర్లను కూడా తన బౌలింగ్ తో ఎదుర్కొనే వాడట. ఆ సమయంలో వైభవ్ తండ్రి బాయిలర్లకు ప్రాక్టీస్ చేయించేందుకు టిఫిన్ అలాగే లంచ్ కూడా ఏర్పాటు చేసేవారట. ప్రతిరోజు వాళ్లకోసం పది టిఫిన్ బాక్సులను తీసుకువెళ్లే వారట వైభవ్ తండ్రి సంజీవ్ సూర్య వంశీ.