భూమిక భర్త ఎలా ఉంటారో…ఏం చేస్తారో తెలుసా…వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోలు…

Bhumika Chawla Family Photo

Bhumika: భూమికా చావ్లా. టాలీవుడ్, కోలివుడ్, తదితర భాషల్లో పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు దశాబ్ధంతో పాటు చిత్ర సీమను ఏలిన నటి. ‘యువకుడు’ సినిమాలో సుమంత్ తో కలిసి ఎంట్రీ ఇచ్చిన సుందరి దాదాపు టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించారు. అన్ని దాదాపుగా బ్లాక్సాఫీస్ ఇట్లే. ఆమె పవన్ కళ్యాణ్ తో నటించిన ‘ఖుషి’తో బాగా ఫేమ్ అయ్యారు.

Bhumika Chawla Husband

తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అనేక సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కొన్ని మూవీస్ లో మాత్రమే అది కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా వచ్చిన ‘సీతా రామం’లో సుమంత్ కు భార్యగా నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి హిట్టయినా ఆమె పాత్ర నిడివి మాత్రం కొంచమే ఉంటుంది. 

ఇక భూమిక కుటుంబం గురించి తెలుసుకుందాం. మంచి సినిమాలలో అవకాశాలు వచ్చే దశలో ఆమె వివాహం చేసుకున్నారు. తను లవ్ చేసిన యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ ను లైఫ్ పార్ట్‌నర్ గా ఎంచుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. భూమిక సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబంతో కలిసి గడిపేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుందట.

Bhumika Chawla Family Photo
Bhumika Chawla Family Photo

షూటింగ్ లు ముగించుకున్నాక షాపింగ్, తదితర వ్యాపకాల జోలికి వెళ్లకుండా కుటుంబంతోనే గడుపుతుందట. ఇటీవల ‘దీపావళి వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నానని, అందరితో కలిసి పండుగ చేసుకుంటే అందులో ఉండే ఆనందం మరెక్కడ ఉండదని’ చెప్తుంది భూమిక. దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారంట. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *