Soundarya: సౌందర్య మరణం తర్వాత ప్రస్తుతం ఆమె భర్త ఎలా ఉన్నారో…ఏం చేస్తున్నారో తెలుసా..!

Soundarya: అలనాటి అందాలతార స్వర్గీయ సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు,తమిళ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సౌందర్య.తన తండ్రికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండటంతో ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది.సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.అయితే యెంత త్వరగా ఆమె సినిమా ఇండస్ట్రీలో రాణించారో అనే త్వరగా విమాన ప్రమాదంలో ఆమెను కోల్పోయారు సినిమా ఇండస్ట్రీ.

ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికి టీవిలో చూసి ఆమెను గుర్తుచేసుకుంటారు అభిమానులు.తెలుగులో ఈమె దాదాపు అందరు అగ్ర హీరోలకు జోడిగా నటించారు.సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బిజెపి పార్టీలో చేరారు సౌందర్య.పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్లిన ఆమె ప్రమాదం లో మరణించారు.సౌందర్య సోదరుడు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు.సౌందర్య మరణించేనాటికే ఆమె పెళ్లి జరిగిపోయింది.

చిన్ననాటి స్నేహితుడు మరియు వరుసకు మేనమామ అయినా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రఘును 2003 లో పెళ్లి చేసుకున్నారు సౌందర్య.ఇక పెళ్లి అయినా ఏడాదికే ఆమె మరణించటంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.ఆ తర్వాత అతను కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని సమాచారం.ఆ తర్వాత రఘు 2011 లో మల్లి పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారని తెలిసింది.సౌందర్య ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇల్లు ప్రస్తుతం పాడుపడ్డ బంగ్లా లా మారిందని వార్తలు వస్తున్నాయి.

Leave a Comment