Actress Nagma: పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్ 90 స్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.టాలీవుడ్ లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు జోడిగా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా రజనీకాంత్,అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మా.తన అందం,అభినయంతో అప్పట్లో కుర్రాళ్ళ కళల రాణి గా మారిపోయింది ఈ అమ్మడు.
అయితే ఎక్కువగా సినిమాలలో ఫ్యామిలీ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండి పోయింది.ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో స్పెషల్ పాత్రలు చేసిన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.ఈ హీరోయిన్ రాజకీయాలలోని అడుగుపెట్టింది.అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి అప్పుడప్పుడు రాజకీయాలలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు అలనాటి తార నగ్మా.
90 స్ లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన నగ్మా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే తాజాగా హీరోయిన్ నగ్మా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలలో నగ్మా ను చుసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సినిమాలలో స్లిమ్ గా నటించిన నగ్మా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో బొద్దుగా కనిపించటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఈమె వయస్సు 48 .తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నగ్మా నాకు ఒక తోడు,పిల్లలు కావాలని ఉందని చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన తనకు ఎప్పుడు లేదని..పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని ఉందని నగ్మా చెప్పుకొచ్చింది.
View this post on Instagram