Blood Pressure: ఈ మధ్యకాలంలో సరిగ్గా లేని జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన ప్రతి ఒక్కరికి కూడా రక్తపోటు సమస్య పెరుగుతుంది. అధిక రక్తపోటు మనిషి మూత్రపిండాలు, కంటి చూపు, జ్ఞాపకశక్తి మరియు నిద్రపై ప్రభావం చూపిస్తుంది. అయితే రాత్రి సమయంలో బిపి పెరగడం చాలా ప్రమాదకరం. ఇటీవలే మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తదితరపు అలవాట్ల వలన అనేక రోగాలు వస్తున్నాయి. ఇటువంటి వాటిలో ముఖ్యంగా అందరిని వేధిస్తున్న సమస్య రక్తపోటు. హై బ్లడ్ ప్రెజర్ ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.
ఎందుకంటే హై బ్లడ్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి చేరినా కూడా వాటి లక్షణాలు కనిపించవు. అధిక రక్తపోటు ధమనులకు నష్టం కలిగించి గుండెపోటు, స్ట్రోక్ లకు దారితీస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే బాధితుల కంటి చూపు మరియు జ్ఞాపకశక్తి కూడా కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో హైబీపీ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. నిద్రపోతున్న సమయంలో రక్తపోటు పెరిగే పరిస్థితి మరింత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి సమయంలో అధిక రక్తపోటు అనేది కొన్ని ముఖ్య లక్షణాలతో గుర్తించుకోవచ్చు. నిద్రలేమి, అధిక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వలన నిద్రలేమి సమస్య రావచ్చు. హైబీపీ వల్ల శరీరంలో సహజ నిద్ర మెలుకువ సమతుల్యత దెబ్బతింటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిద్ర పట్టడం కష్టతరం అనిపిస్తుంది.
అలాగే రాత్రిపూట తరచుగా మెలకువ రావడం, అశాంతిగా అనిపించడం వంటివి కూడా హైబీపీ లక్షణాలు. శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనను అధిక రక్తపోటుకు పెంచి నిద్రలో ఆటంకాలను కలగజేస్తుంది. అలాగే అధిక రక్తపోటు ఉన్న వారిలో గురక సమస్య ఉండే అవకాశం కూడా ఉంది. నిద్రపోతున్న సమయంలో గాలి ప్రవాహ మార్గం కుచించుకుపోవడం వల్ల గురక సమస్య వస్తుంది. అలాగే అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలు క్షీణించడం మరియు రక్త ప్రవాహం తగ్గిపోవడం కూడా వీటికి కారణం అయ్యే అవకాశం ఉంది.







