నల్ల దారాన్ని ఏ రోజున ఏ కాలికి కట్టుకోవాలో తెలుసా…అసలు నల్ల దారాన్ని కట్టుకోవడం ఏం జరుగుంతుందో తెలుసా…

NEWS DESK
2 Min Read

చాల మంది తమ కాళ్ళకు నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు.సాధారణ ప్రజల నుంచి సెలెబ్రెటీల వరకు కాళ్ళ కు నల్ల దారాన్ని కట్టుకోవడం సర్వసాధారణమైపోయింది.ప్రస్తుత కాలంలో కాళ్ళకు నల్ల దారాన్ని కట్టుకోవడం ఫాషన్ గా భావిస్తున్నారు చాల మంది.మార్కెట్ లో కూడా కాళ్ళకు కట్టుకునే నల్ల దారాలు చాల రకాలలో లభిస్తున్నాయి.అయితే అసలు కాళ్ళకు నల్ల దారాన్ని ఎందుకు కట్టుకోవాలి..ఏ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి..అనే విషయాలు చాల మందికి తెలియదు.ఒక వ్యక్తి కంటి చూపుకు పాజిటివ్ శక్తి మరియు నెగటివ్ శక్తి రెండు ఉంటాయి.ఆ శక్తి ఒక వ్యక్తి స్వభావాన్ని బట్టి బయటకు వస్తుంది.ఒక అయస్కాంత క్షేత్రం ప్రతి మనిషి చుట్టూ ఉంటుంది.

ఎదుటి మనిషి నుంచి వచ్చే శక్తి ఆ అయస్కాంత క్షేత్రాన్ని ఛేదించుకొని మనపై పాడినప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.దీనినే దిష్టి తగలడం అని కూడా అంటుంటారు చాల మంది.ఇలా ఎదుటి వారి నుంచి నెగటివ్ శక్తి మనపై పాడినప్పుడు ఆవలింతలు,వాంతులు,బద్ధకం,తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.ఇలా ఎదుటి వారి దిష్టి మనపై పడకుండా ఉండటానికి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు.నలుపుకు దృష్టిని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి నల్ల దారాన్ని కాలికి కట్టుకోవడం మంచిది అని పెద్దలు చెప్తుంటారు.

అందుకే చాల మంది నల్ల చుక్కలను చిన్న పిల్లలకు బుగ్గ మీద,అరికాళ్లలో పెడుతూ ఉంటారు చాల మంది.ప్రతి ఒక్కరు నల్ల చుక్క పెట్టుకోలేరు కాబట్టి కాళ్ళకు నలుపు దారాన్ని కట్టుకోవడం అలవాటు చేసారు చాల మంది పెద్దలు.ఎదుటి వారి నుంచి వచ్చే నెగటివ్ శక్తిని ఈ నల్ల దారం గ్రహించి మనకు దిష్టి తగలకుండా చేస్తుంది.ఈ నలుపు రంగు దారాన్ని పురుషులు కుడి కాలుకు మరియు స్త్రీలు ఎడమ కాళ్ళకు కట్టుకోవాలంట.అయితే ఎక్కువగా దిష్టి తగిలే వారు ఈ నలుపు రంగు దారాన్ని అమావాస్య తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున కట్టుకోవాలి అని చెప్తున్నారు నిపుణులు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *